Begusarai: బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదు ఇళ్లు దగ్ధం కాగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో అర్వా నాయ తోలా వార్డు నంబర్ 9లో నివాసం ఉంటున్న రామ్‌కుమార్ పాశ్వాన్‌కు చెందిన 35 ఏళ్ల కుమారుడు నీరజ్ కుమార్, 32 ఏళ్ల భార్య సవితా దేవి, ఐదేళ్ల కుమారుడు కుష్ కుమార్, మూడేళ్ల కుమారుడు లవ్ కుమార్ ఉన్నారు.
Read Also: Karnataka : 31ఏళ్ల తర్వాత తెరుచుకున్న ఆలయ ఉద్యమ ఫైల్.. 300మందిని పట్టుకునేందుకు ప్లాన్
ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు మాట్లాడుతూ.. రాత్రి ఎనిమిది గంటల సమయంలో నీరజ్‌కుమార్ భోజనం చేసి కుటుంబసభ్యులతో కలిసి నిద్ర పోయారు. 10 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అతని ఇంటిలో భారీ మంటలు ఎగసిపడ్డాయన్నారు. ఆ మంటలు కొద్దిసేపటికే చుట్టుపక్కల ఉన్న మరో ఐదు ఇళ్లను చుట్టుముట్టాయన్నారు. అగ్ని జ్వాలలు భారీగా ఎగిసిపడడంతో నీరజ్ కుమార్‌తో పాటు అతని కుటుంబం మొత్తం సజీవ దహనమయ్యారని చెప్పారు. ఈ ఘటనలో సమీపంలోని మరో ఐదు ఇళ్లలో నిద్రిస్తున్న 40 మంది ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
Read Also: Bubblegum : డిజాస్టర్ దిశగా సాగుతున్న రోషన్ కనకాల బబుల్‌గమ్ మూవీ..
కాగా, సమాచారం అందుకున్న వెంటనే బచ్వారా పోలీస్ స్టేషన్ చీఫ్ అజిత్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన భార్యాభర్తల మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. పిల్లలిద్దరూ కాలి బూడిదైనట్లు ప్రకటించారు. అయితే, నీరజ్ కుమార్ కూలి పని చేసి కుటుంబాన్ని పోషించేవాడని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో బంధువుల రోదనలతో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.