కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ కారు అతి వేగంగా నడిపి చిక్కుల్లో పడ్డారు. బీహార్‌లో టోల్‌ఫ్లాజా దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా కేంద్రమంత్రి కారు అతి వేగంగా వెళ్లినట్లు గుర్తించింది. దీంతో చిరాగ్ పాసవాన్ కారుకు ఈ-చలానా విధించబడింది. రెండు వేల రూపాయల వరకు చలానా విధించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బీహార్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సొంత జిల్లా ముంగేర్ జిల్లాలో 24 గంటల్లోనే దుండుగులు నాలుగు భారీ ఘటనలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుడు బీజేపీ నగర అధ్యక్షుడు ఫంతుష్ కుమార్ అలియాస్ బంటీ సింగ్ గా గుర్తించారు. బీజేపీ నాయకుడు తన కుమారుడితో కలిసి నిద్రిస్తున్న సమయంలో దుండగులు కాల్చారని స్థానికులు చెబుతున్నారు.
బీహార్‌లో కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌పై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో తప్పించుకున్నారు. ఒక పబ్లిక్ ఈవెంట్లో ఈ ఘటన జరిగింది. మంత్రి కార్యక్రమాన్ని ముగించుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. మైక్రోఫోన్‌ను లాక్కొని కేంద్రమంత్రిపై పిడిగుద్దులు కురిపించేందుకు ప్రయత్నించాడు.
Chirag Paswan: కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ బీజేపీతో విభేదాలను తోసిపుచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ నుంచి తనకు విడదీయరాని బంధం ఉందని, తనను విడదీయలేరని అన్నారు. బీజేపీ కోరుకుంటే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
Govt Schools Closed: భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల దాటికి బీహార్ రాష్ట్ర రాజధానిలోని గంగా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో నీటి మట్టం భారీగా పెరుగి పోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
NSG New Chief: ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే జాతీయ భద్రత దళం కొత్త డైరెక్టర్ జనరల్‌గా (DG) సీనియర్ ఐపీఎస్ అధికారి బి.శ్రీనివాసన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
Bihar: బీహార్ అరారియాలో ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌లో కారం పొడి పోసి దాడి చేయడం వైరల్‌గా మారింది. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనానికి పాల్పడ్డాడనే అభియోగంపై కొందరు బాధితుడి చేతులు వెనకకు కట్టి, ప్యాంట్ విప్పి, అతడి ప్రైవేట్ పార్టులో కారం పోసి, కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీడియోలో కనిపిస్తున్న మహ్మద్ సిఫత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, బీహార్‌లోని సున్నీ వక్ఫ్ బోర్డు ఒక గ్రామంలో చాలా కాలంగా నివసిస్తున్న వారికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సదరు భూమి వక్ఫ్ భూమిగా పేర్కొంటూ ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ వివాదాస్పద ప్రాంతంలో నివసించే వారిలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. ప్రస్తుతం ఈ సమస్య పాట్నా హైకోర్టు ముందు ఉంది, సున్నీ వక్ఫ్ బోర్డు వారి వాదనలకు మద్దతుగా ఎలాంటి సాక్ష్యాధారాలను అందించడంలో విఫలమైంది.