ప్రధాని మోడీ మంగళవారం 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోడీ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా పండుగలా నిర్వహించారు. అన్నదానాలు, రోగులకు పండ్లు పంపిణీ చేయడం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
బీహార్‌లో మరో రైలుకు ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. దీంతో.. ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటన కిషన్‌గంజ్ రైల్వే స్టేషన్ కు 200 నుంచి 250 మీటర్ల దూరంలో ఉన్న ఫరింగోరా సమీపంలో జరిగింది. కిషన్‌గంజ్ నుండి సిలిగురికి వెళ్లే DMU ప్యాసింజర్ రైలు ఇంజిన్ కంపార్ట్మెంట్లో మంటలు వచ్చాయి.
గంగానది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న లోతైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని వలన భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Waqf board: బీహార్ బీజేపీ మాజీ చీఫ్, ఎంపీ డాక్టర్ సంజయ్ జైశ్వాల్ వక్ఫ్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ రాష్ట్ర సున్నీ వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణలో పారదర్శకత లోపించిందని ఆరోపించిందని,
బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన డాక్టర్ ప్రైవేట్ పార్ట్‌ను నర్సు కోసేసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో డాక్టర్‌తో పాటు మరో ఇద్దరు సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వైద్యుడు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. ఈ సంఘటన ముశ్రీఘరారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాపూర్‌లోని ఆర్బిఎస్ హెల్త్ కేర్‌లో జరిగింది. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ సంజు తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి మొదట…
Suicide Attempt: బీహార్ లోని మోతీహరిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను చనిపోవాలని రైల్వే ట్రాక్‌పై పడుకున్న బాలిక గాఢనిద్రలోకి జారుకుని అక్కడే పడుకుండి పోయింది. మరోవైపు అదే ట్రాక్ మీదుగా వెళ్తున్న రైలును లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఎలాగోలా ఆపేశాడు. అదృష్టవశాత్తూ ఎలాగోలా బాలిక ప్రాణానికి ఎటువంటి ఆటంకం కలగలేదు. ఈ ఘటన మోతీహరి లోని చకియా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవాలనే…
కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ కారు అతి వేగంగా నడిపి చిక్కుల్లో పడ్డారు. బీహార్‌లో టోల్‌ఫ్లాజా దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా కేంద్రమంత్రి కారు అతి వేగంగా వెళ్లినట్లు గుర్తించింది. దీంతో చిరాగ్ పాసవాన్ కారుకు ఈ-చలానా విధించబడింది. రెండు వేల రూపాయల వరకు చలానా విధించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.