Chirag Paswan: కేంద్రమంత్రి కారుకి రూ.2 వేల చలానా.. అతి వేగమే కారణం!
- కేంద్రమంత్రి కారు చిరాగ్ పాసవాన్‌కి 2 వేల చలానా
- అతి వేగమే కారణం!.. చర్చనీయాంశంగా వ్యవహరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ కారు అతి వేగంగా నడిపి చిక్కుల్లో పడ్డారు. బీహార్‌లో టోల్‌ఫ్లాజా దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా కేంద్రమంత్రి కారు అతి వేగంగా వెళ్లినట్లు గుర్తించింది. దీంతో చిరాగ్ పాసవాన్ కారుకు ఈ-చలానా విధించబడింది. రెండు వేల రూపాయల వరకు చలానా విధించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Rhea Chakraborty: నేను జైలులో ఉన్నప్పుడు.. నా తల్లిదండ్రులు ఫ్రెండ్స్ తో కలిసి మందేశారు!
Also Read
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
చిరాగ్ పాసవాన్ వాహనంలో బీహార్‌లోని హాజీపుర్ నుంచి చంపారన్‌కు వెళుతున్నారు. అతి ఆయన కారు.. అతి వేగంగా వెళ్లడంతో ఈ- చలానా జారీ అయినట్లు కథనాలు వెలువడ్డాయి. జాతీయ రహదారిపై పరిమితికి మించిన వేగంతో వెళుతుండగా.. దాన్ని గుర్తించిన ఈ- డిటెక్షన్ సిస్టమ్ ఆయన వాహనానికి ఆటోమేటిక్ చలానాను జారీ చేసినట్లు తెలుస్తోంది. అతివేగమే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే ఈ చలానాతో కేంద్రమంత్రికి సంబంధం లేదంటూ చిరాగ్ సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Paralympics 2024: భారత్‌కు మరో బంగారు పతకం.. బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన నితీష్ కుమార్
అతివేగంగా వెళ్లడం, డాక్యుమెంట్ లోపాలను సులువుగా ఈ- డిటెక్షన్ గుర్తిస్తుంది. ఈ సిస్టమ్‌ను బీహార్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల అమలు చేస్తోంది. ఆటోమేటిక్ చలానాల జారీ కోసం అన్ని టోల్ ప్లాజాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధించేందుకు ఈ సిస్టమ్‌ను ఆగస్టు నుంచి అమలు చేస్తోంది. ఇప్పటి వరకు రూ.9.49 కోట్ల జరిమానాలను జారీ అయ్యాయి. వాహనాల ఫిట్‌నెస్, కాలుష్య, డాక్యుమెంట్ లోపాలు, అతివేగంగా వెళ్లినప్పుడు చలానా జారీ అవుతుంది. జరిమానా నేరుగా కారు యాజమాని మొబైల్ నెంబర్‌కు వెళ్తుంది. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి ఈ-చలానా రావడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Gujarat High Court: భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!