పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే గతి తప్పుతున్నారు. మార్గదర్శకులుగా ఉండాల్సిన వాళ్లే మార్గం తప్పుతున్నారు. తల్లిదండ్రుల తర్వాత సన్మార్గంలో నడిపించేది ఉపాధ్యాయులే. అలాంటి పండితులు మత్తుగా మద్యం సేవించి స్కూల్‌లో మతి తప్పి ప్రవర్తించారు. విద్యావ్యవస్థకే మాయనిమచ్చగా మిగిలారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Caste Enumeration : తెలంగాణ సర్వే దేశానికే ఆదర్శం.. కోటి మైలురాయి దాటిన ఇంటింటి కుటుంబ సర్వే
బీహార్‌లోని నలంద ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, టీచర్ ఫుల్‌గా మద్యం సేవించి స్కూల్‌కు వచ్చారు. వారి తీరును చూసి గ్రామస్తులు అవాక్కయ్యారు. పాఠశాల సమయంలోనే పాఠశాలలో ప్రిన్సిపాల్ నాగేంద్రప్రసాద్, ఉపాధ్యాయుడు సుబోధ్ కుమార్ విచిత్రంగా ప్రవర్తించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. టీచర్ సుబోధ్‌కుమార్‌ను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపు వాగ్వాదం తర్వాత ఇద్దరు గురువులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Winter: చలికాలంలో శ్వాసకోస బాధితులు తీసుకోవల్సిన జాగ్రత్తలివే!
देखें वीडियो, शराबबंदी वाले बिहार में दारू पीकर गली में लोट रहे बच्चों के गुरु जी, पकड़ने आया पुलिस वाला भी नशे में…?…#Bihar #LiquorBan #BiharGovtTeachers #NalandaTeachers #BiharPolice #ViralVideo #ViralNews #BiharNews pic.twitter.com/2wKWwy2MHn
— Live Cities (@Live_Cities) November 22, 2024