Bihar : బీహార్‌లోని దర్భంగాలోని షిషేన్లో నిర్మిస్తున్న బైపాస్ రైల్వే స్టేషన్ రైల్వే లైన్ సమీపంలో ముగ్గురు మహిళలను రైలు ఢీకొట్టింది. ఈ ముగ్గురు మహిళలు గోపాల్‌పూర్‌లో రైలు ఢీకొని మరణించారు.
Vulgar Dancing In School: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన పాఠశాలను కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చుకున్నారు. స్కూల్ లోనే మద్యం తాగుతూ, బార్ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకర నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు.
బీహార్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్ క్లబ్‌గా మారిపోయింది. పాఠశాలను బార్గా మార్చేసి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చేశారు. పాఠశాలలోనే మద్యం తాగుతూ, బార్ డ్యాన్సర్లతో అశ్లీల డ్యాన్స్‌లు చేయిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. సహర్సా జిల్లా జలాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
బీహార్‌లో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. గంగా తీరం వెంబడి ఉన్న దాదాపు 12 జిల్లాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో 13.5 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 376 గ్రామ పంచాయతీలు ప్రభావితమయ్యాయి. చాలా మంది నివాసితులు శిబిరాలకు తరలించారు.
బీహార్‌లోని పూర్నియాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు హిందూ యువతిని ప్రేమ వలలో ట్రాప్ చేసేందుకు తన పేరు, గుర్తింపును మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు.
బీహార్‌లోని షేక్‌పురాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. నేరస్థులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని కళ్లను పీకేసి చంపారు. అంతేకాకుండా.. మృతుడి ఆధారాలు కనిపెట్టకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని యాసిడ్ పోసి కాల్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన షేక్‌పురా జిల్లా ధరేని గ్రామంలో చోటు చేసుకుంది.
Boat Crash: బీహార్ లోని సరన్ జిల్లా సోన్‌పూర్‌లో గురువారం అర్థరాత్రి పడవ బోల్తా పడటంతో నలుగురు గల్లంతయ్యారు. హైటెన్షన్ లైన్ తగిలి ఇద్దరు వ్యక్తులు కాలిపోయారు. వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. బోటులోని ఓ ప్రయాణికుడు మొండిగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బోటులోని చాలా మంది వ్యక్తులు సోన్పూర్ నుండి పనులు ముగించుకొని తమ గ్రామానికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పడవలో 16 మంది ఉన్నారు. ఇక…
బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. సరన్‌లో ఆలయం గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
Bihar : బీహార్‌లోని నవాడా జిల్లాలో రౌడీలు దళిత కాలనీని చుట్టుముట్టి నిప్పంటించారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ గ్రామంలో జరిగిన ఈ దహనం ఘటనలో గ్రామంలోని 80 ఇళ్లు దగ్ధమయ్యాయి.