Bihar: బీహార్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత, నితీష్ కుమార్ నేతృత్వంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవికి షాక్ ఇచ్చింది. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న రబ్రీదేవి, లాలూ ప్రసాద్ కుటుంబం దాదాపు 20 ఏళ్లుగా ఉంటున్న 10 సర్క్యులర్ రోడ్‌లోని నివాసాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర భవన నిర్మాణ శాఖ రబ్రీ దేవికి హార్డింగ్ రోడ్‌లోని సెంట్రల్ పూల్ హౌస్ నంబర్ 39 అనే కొత్త ప్రభుత్వ నివాసాన్ని కేటాయించింది.
Read Also: Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి కథలో కొత్త ట్విస్ట్.. పలాష్ తల్లి సంచలన వ్యాఖ్యలు
గతంలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈ ఇంటిని కేటాయించారు. ఇప్పుడు ప్రభుత్వం దానిని అప్పగించాలని ఆదేశించింది. రబ్రీ కుటుంబానికి ఈ నివాసం పార్టీ కార్యకలాపాలకు, నాయకులు, మీడియా సమావేశాలకు కేంద్రంగా ఉండేది. కొత్త ఉత్తర్వుల్లో రబ్రీదేవి కుటుంబానికి హార్డింగ్ రోడ్ నివాసాన్ని కేటాయిస్తున్నారు. కొత్తగా కొలువుదీరిన నితీష్ సర్కార్‌లోని మంత్రులకు భవనాలను కేటాయించే ప్రక్రియ వేగవంతమైన తరుణంలో రబ్రీ దేవీకి నివాసం ఖాళీ చేయాలనే ఆదేశాలు వచ్చాయి.