Bihar Elections 2025: భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా రికార్డు స్థాయిలో 66.91 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 65.08 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. ఇదిలా ఉండగా, మంగళవారం(నవంబర్ 11)న జరిగిన రెండవ దశలో 68.76 శాతం పోలింగ్ నమోదైంది.
Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ప్రారంభమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి దశలో 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ బూత్‌ల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటు చేసింది. అంతే కాదు.. ఎన్నికల కమిషన్ ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్ ద్వారా అన్ని…
Cobra snake: బీహార్ రాష్ట్రంలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా, నాగుపాము అంటేనే ఒక్కొక్కరు భయపడి చస్తారు. అలాంటి ఓ ఏడాది వయసు ఉన్న బాలుడు, నాగుపామునే కరిచి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బెట్టియ్య గ్రామంలోని ఏడాది వయసు ఉన్న బాలుడు ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా, ఓ నాగుపాము అతడి చేతికి చుట్టుకుంది. ఆ పసివాడు, అది భయంకరమైన పాము అని తెలియక, దానిని గట్టిగా పళ్లతో కొరికాడు. దీంతో పాము చనిపోయినట్లు…
బీహార్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కతిహార్ బరౌని రైల్వే సెక్షన్‌లోని కధగోలా, సేమాపూర్ మధ్య మహారాణి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బరౌని నుంచి కతిహార్‌కి వస్తున్న 15910 అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ రైలు.. రైల్వే ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ట్రాలీమ్యాన్ అక్కడికక్కడే మరణించాడు. నలుగురు రైల్వే కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో ఉన్నారు. సివాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది వేశామని ప్రధాని మోడీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్‌ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయన్నారు. పేదరికాన్ని తగ్గించవచ్చని తాము చూపించామని, ప్రపంచ బ్యాంకు సైతం భారతదేశానికి అభిమానిగా మారిందని మోడీ అన్నారు.
బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) నాయకుడు తేజస్వి యాదవ్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తేజస్వి యాదవ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఓ ట్రక్కు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో తేజస్వి యాదవ్ మాధేపుర నుంచి పాట్నాకు తిరిగి వస్తున్నారు.
Illegal Affair : వివాహం తర్వాత కూడా కొందరు తమ జీవిత భాగస్వామిని మోసం చేయడమే పని. అలాంటిదే ఓ విచిత్రమైన కథ ఇప్పుడు బయటపడింది. అరరియా జిల్లాలో ఓ పెళ్లైన మహిళ తన భర్తను ఏకంగా 9 ఏళ్లుగా మోసం చేస్తూ వస్తోంది. ఆశ్చర్యం ఏంటంటే… ఆమె ఎవరితో లవ్ ఎఫైర్ పెట్టుకుందో తెలుసా? తన భర్త సొంత అన్నతోనే..! ఈ ఇద్దరూ ఒక్కోసారి నేపాల్ వెళ్లి హనీమూన్‌లు కూడా జరుపుకునేవారు. కానీ ఈసారి అద్భుతం…
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత సమయంలో బీహార్‌కు చెందిన ఓ జావాన్ అమరవీరుడయ్యారు. ఆ అమరవీరుడికి వివాహం జరిగి కేవలం ఐదు నెలలు మాత్రమే అయ్యింది. ఈ వార్త విన్న భార్య షాక్‌కి గురైంది. ఆ జవాన్ పేరు రాంబాబు ప్రసాద్. ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న తన భార్యను ఒంటరిగా వదిలేశాడు. వాస్తవానికి తమది ప్రేమ వివాహమని ఆ సైనికుడు రాంబాబు భార్య అంజలి తెలిపింది. తమ ప్రేమ వ్యవహారం 8 సంవత్సరాలుగా కొనసాగిందని.. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి…
Crime: బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో హృదయ విదారక సంఘటన జరిగింది. పిల్లల ముందే ఓ కసాయి భర్త తన భార్యను కొట్టి చంపాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. జిల్లాలోని మోతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింగా గ్రామంలో ఈ దారుణం జరిగినట్లు శనివారం పోలీసులు తెలిపారు.