Tejashwi Yadav: తృటిలో తప్పించుకున్న తేజస్వి యాదవ్.. ముగ్గురు భద్రతా సిబ్బంది గాయాలు..
- తేజస్వి యాదవ్‌కి తృటిలో తప్పిన ప్రమాదం
- కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన ట్రక్కు
- కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని ఢీకొట్టిన ట్రక్కు
- ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) నాయకుడు తేజస్వి యాదవ్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తేజస్వి యాదవ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఓ ట్రక్కు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో తేజస్వి యాదవ్ మాధేపుర నుంచి పాట్నాకు తిరిగి వస్తున్నారు. జాతీయ రహదారిపై టీ తాగడానికి ఆగారు. తేజస్వి తన అధికార ప్రతినిధి శక్తి యాదవ్, కొంతమంది ఆర్జేడీ నాయకులతో కలిసి కారు దిగగానే వేగంగా వస్తున్న ట్రక్కు కాన్వాయ్‌లోకి ప్రవేశించి కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భద్రత కోసం మోహరించిన ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. తేజస్వి యాదవ్ వెంటనే వారిని హాజీపూర్‌లోని సమీపంలోని సదర్ ఆసుపత్రికి తరలించారు.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
ప్రమాదం గురించి తేజస్వి యాదవ్ ఏమన్నారు?
తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ” మేము ఓ కార్యక్రమాన్ని ముగించుకుని మాధేపుర నుంచి తిరిగి వస్తున్నాం. మధ్యలో టీ తాగడానికి ఆగాం. ఓ ట్రక్కు అదుపు తప్పి నా ముందు ఉన్న 2-3 వాహనాలను ఢీకొట్టింది. మా భద్రతా సిబ్బంది నిలబడి ఉన్నారు. వాహనం వారిని కూడా ఢీకొట్టింది. 2-3 మంది గాయపడ్డారు. కొంచెం అ జాగ్రత్తగా ఉంటే నాకు కూడా ప్రమాదం జరిగి ఉండేది. ఈ సంఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: Elon Musk: అమెరికాలో కొత్త పార్టీ.. మస్క్ వాదనకు 80% మద్దతు..!
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!