Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ప్రారంభమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి దశలో 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ బూత్‌ల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటు చేసింది. అంతే కాదు.. ఎన్నికల కమిషన్ ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్ ద్వారా అన్ని పోలింగ్ బూత్‌లను పర్యవేక్షిస్తుంది. ఎన్నికల కమిషన్ ప్రకారం.. మొదటి దశలో 30 మిలియన్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీరిలో 19.8 మిలియన్ల మంది పురుషులు, 17.6 మిలియన్ల మంది మహిళలు, ఇతరులు ఉన్నారు.
READ MORE: Revanth Reddy: కింగ్ అవ్వుడు సంగతి పక్కనపెట్టు.. ముందు డిపాజిట్ తెచ్చుకో కిషన్ రెడ్డి!
మొదటి దశ ఓటింగ్ కోసం ఎన్నికల సంఘం మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 36,733 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మొదటి దశలో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు, 18-19 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు 7.38 లక్షల మంది ఉన్నారు. ఈ 121 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం జనాభా సుమారు 6.60 కోట్లు కాగా, ఓటర్ల జాబితాలో 3.75 కోట్ల పేర్లు ఉన్నాయి. తొలి దశలో 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తేజస్వి యాదవ్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, అసెంబ్లీ స్పీకర్ విజయ్ సిన్హా, బీహార్ ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులు సహా ప్రముఖుల భవితవ్యం నిర్ణయించనుంది. నవంబర్ 14 న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు.
READ MORE: Putin Nuclear Test: ఇక పుతిన్ వంతు.. అణ్వాయుధ పరీక్షలకు ఆదేశించిన రష్యా అధ్యక్షుడు!