ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో ఉన్నారు. సివాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది వేశామని ప్రధాని మోడీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్‌ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయన్నారు. పేదరికాన్ని తగ్గించవచ్చని తాము చూపించామని, ప్రపంచ బ్యాంకు సైతం భారతదేశానికి అభిమానిగా మారిందని మోడీ అన్నారు.
READ MORE: Shekar Kammula : భారీ బడ్జెట్ కాదు.. ప్రేక్షకులు మెచ్చినవే పాన్ ఇండియా మూవీలు..
ఇటీవల వైరల్ అవుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిత్రంపై ప్రధాని స్పందించారు. ఆర్జేడీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫొటోను తన పాదాల వద్ద ఉంచుకుంటుందని, కానీ మోడీ మాత్రం అంబేద్కర్‌ను తన హృదయంలో ఉంచుకున్నానన్నారు. “మేము సబ్కా సాథ్, సబ్కా వికాస్ అని అంటాం, కానీ మన ప్రతిపక్షాలు పరివార్ కా సాథ్, పరివార్ కా వికాస్ అని అంటారు. ఇటీవలే బాబా సాహెబ్ చిత్రాన్ని అవమానించారు. ఆ చిత్రాన్ని నేను చూశాను. ప్రజలు క్షమాపణ చెప్పమని అడిగారు. కానీ ఆయన ఎప్పటికీ క్షమాపణ చెప్పరు” మోడీ వ్యాఖ్యానించారు.
READ MORE: PM Modi: దేశాభివృద్ధికి బీహారే కీలకం.. మెగా ప్రాజెక్ట్‌లు ప్రారంభించిన మోడీ
ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “నేను నిన్ననే విదేశాల నుంచి తిరిగి వచ్చాను. ఈ పర్యటన సందర్భంగా నేను చాలా మంది నాయకులతో మాట్లాడాను. అందరు నాయకులు భారతదేశ అభివృద్ధిని చూసి మెచ్చుకున్నారు. భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుందని వారు భావించారు. ఇందులో బీహార్ చాలా పెద్ద పాత్ర పోషించబోతోంది. పంజా, లాంతరు ఉన్న వ్యక్తులు బీహార్ గౌరవాన్ని దెబ్బతీశారు. ఈ వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. అందుకే బీహార్ పేదరికంలో కూరుకుపోయింది. అనేక సవాళ్లను అధిగమించి.. సీఎం నితీష్ నాయకత్వంలో బీహార్‌ను తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చాం. నేను బీహార్ ప్రజలకు విశ్వాసం కలిగించడానికి వచ్చాను. ఇప్పటికే బీహార్ ప్రజల కోసం చాలా చేశాను. ఇంకా చాలా చేయాల్సి ఉంది. గత 10-11 సంవత్సరాల్లో 55 వేల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు నిర్మించాం. 1.5 కోట్లకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా అందించాం. 1.5 కోట్ల మందికి నీటి కనెక్షన్ ఇచ్చాం. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.” అని ప్రధాని మోడీ తెలిపారు.