Cobra snake: బీహార్ రాష్ట్రంలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా, నాగుపాము అంటేనే ఒక్కొక్కరు భయపడి చస్తారు. అలాంటి ఓ ఏడాది వయసు ఉన్న బాలుడు, నాగుపామునే కరిచి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బెట్టియ్య గ్రామంలోని ఏడాది వయసు ఉన్న బాలుడు ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా, ఓ నాగుపాము అతడి చేతికి చుట్టుకుంది. ఆ పసివాడు, అది భయంకరమైన పాము అని తెలియక, దానిని గట్టిగా పళ్లతో కొరికాడు. దీంతో పాము చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
Read Also: Manipur: మణిపూర్‌లో భారీగా గన్స్, బుల్లెట్స్, గ్రెనేడ్స్ స్వాధీనం..
గోవిందగా గుర్తించిన బాలుడు కొద్దిసేపటికి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పిల్లాడు తనను తాను రక్షించుకునే ప్రయత్నంలోనే ప్రతిచర్యగా పామును పళ్లతో కొరికి చంపేసినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల చికిత్స తర్వాత పిల్లవాడు గోవింద పరిస్థితి క్షీణించడంతో, అతడిని కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) నుంచి బెట్టియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల-ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం, పిల్లవాడి ఆరోగ్యం స్థిరంగా ఉందని, అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు చెబుతున్నారు.