కుటుంబ సభ్యులతో కలిసి మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటు వేశారు. బీహార్‌లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. 121 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక తేజస్వి యాదవ్ కూడా తన కుటుంబంతో కలిసి వచ్చి పాట్నాలో ఓటు వేశారు.
బీహార్‌లో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలి విడతలో భాగంగా 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటుండగా.. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
బీహార్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా.. మొదటి విడతగా 121 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ప్రారంభమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి దశలో 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ బూత్‌ల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటు చేసింది. అంతే కాదు.. ఎన్నికల కమిషన్ ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్ ద్వారా అన్ని…
Bihar elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ కు ఒక రోజు ముందు జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి బీజేపీలో చేరారు. గురువారం బీహార్‌లో మొదటి విడుత ఓటింగ్ జరబోతోంది. దీనికి ఒక్క రోజు ముందే ప్రశాంత్ కిషోర్‌కు ఆయన పార్టీ అభ్యర్థి ఝలక్ ఇచ్చారు. ముంగేర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తు సంజయ్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. ముంగేర్ బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ సమక్షంలో బీజేపీ సభ్యత్వాన్ని…
Rajnath Singh: భారతదేశంలోని 10 శాతం మంది సైన్యాన్ని నియంత్రిస్తున్నారు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, అగ్రకులాలే సైన్యాన్ని నియంత్రిస్తున్నాయని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీహార్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్ర నేత కీలక ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరిగిందంటూ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని.. తీరా ఫలితాల సమయానికి అంతా తారుమారు చేశారని ఆరోపించారు.
బీహార్‌లో తొలి విడత సమరానికి సిద్ధమైంది. గురువారం 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో మొదటి విడతగా పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక ఎన్నికల సిబ్బంది కూడా ఆయా బూత్‌లకు తరలివెళ్తున్నారు.
Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సైన్యం దేశ జనాభాలో 10 శాతం మంది (అగ్రకులాలను సూచిస్తూ) నియంత్రణలో ఉందని మంగళవారం అన్నారు. బీహార్ ఔరంగబాద్‌లో ప్రచారం చేస్తూ.. దేశ జనాభాలో 10 శాతం మందికి కార్పొరేట్ రంగాలు, బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థలో అవకాశాలు లభిస్తున్నాయి, సైన్యం కూడా వారి నియంత్రణలో ఉంది అని అన్నారు. మిగిలిన 90 శాతం, వెనుకబడిన తరగతులు, దళితులు, షెడ్యూల్డ్ తెగలు,…
Imran Masood:బీహార్ ఎన్నికల పోరులో కొత్త పంచాయతీ మొదలైంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ దేశభక్తుడు, విప్లవకారుడు భగత్ సింగ్‌ను తీవ్రవాద ఇస్లామిక్ సంస్థ హమాస్‌తో పోల్చడం బీహార్‌లో కొత్త వివాదానికి దారితీసింది. ఆయన ప్రకటనపై బీజేపీ ఎదురు దాడి చేయడం ప్రారంభించింది. బీజేపీ దాడి తరువాత మసూద్ తన ప్రకటనపై వెనక్కి తగ్గాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ అలాంటి పోలిక చేయలేదని, భగత్ సింగ్ “షహీద్-ఎ-ఆజం” అని,…