కుటుంబ సభ్యులతో కలిసి మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటు వేశారు. బీహార్‌లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. 121 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక తేజస్వి యాదవ్ కూడా తన కుటుంబంతో కలిసి వచ్చి పాట్నాలో ఓటు వేశారు.
అనంతరం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 14న కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధి, విద్య, మంచి ఆరోగ్య సంరక్షణ కోసం ఓటు వేయాలని కోరారు. బీహార్ ప్రజలు వర్తమానం, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Pak-Afghan: ఈరోజు మరోసారి చర్చలు.. విఫలమైతే యుద్ధమేనన్న పాక్ రక్షణమంత్రి ఖవాజా
మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకురాలు రబ్రీ దేవి కూడా ఓటర్లకు కీలక పిలుపునిచ్చారు. ఓటర్లు ఇంట్లో నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేయాలని కోరారు. మీ ఓటు హక్కు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఈరోజు బీహార్‌లో ప్రజాస్వామ్య పండుగ.. పెద్ద ఎత్తున ఓట్లు వేయాలని మోడీ పిలుపు
తొలి దశలో పోటీ చేస్తున్న వారిలో మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, బీజేపీ ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా వంటి అగ్ర నాయకులు ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి దశలో 121, రెండో దశలో 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 11న రెండు విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.
#WATCH | Patna: After casting his vote, RJD leader and Mahagathbandhan's CM face Tejashwi Yadav says, "I appeal to the people of Bihar to cast their votes in large numbers, keeping in mind their present and future. Vote for employment, education, good healthcare… We are going… pic.twitter.com/TiB6482PKN
— ANI (@ANI) November 6, 2025