Bihar elections 2025: ప్రశాంత్ కిషోర్‌కు ఝలక్.. ఓటింగ్‌కు ఒక రోజు ముందు బీజేపీలోకి జన్‌సురాజ్ అభ్యర్థి..
- బీహార్‌లో ప్రశాంత్ కిషోర్‌కు వరస ఎదురుదెబ్బలు..
- ఎన్నికలకు ఒక రోజు ముందు జన్ సురాజ్ అభ్యర్థి బీజేపీ లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ కు ఒక రోజు ముందు జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి బీజేపీలో చేరారు. గురువారం బీహార్‌లో మొదటి విడుత ఓటింగ్ జరబోతోంది. దీనికి ఒక్క రోజు ముందే ప్రశాంత్ కిషోర్‌కు ఆయన పార్టీ అభ్యర్థి ఝలక్ ఇచ్చారు. ముంగేర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తు సంజయ్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. ముంగేర్ బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ సమక్షంలో బీజేపీ సభ్యత్వాన్ని తీసుకుని, ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చారు.
Read Also: Rajnath Singh: సైన్యానికి కుల మతాలు లేవు.. రాహుల్‌గాంధీపై రక్షణ మంత్రి ఆగ్రహం..
Also Read
- మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
ఈ అసెంబ్లీ నుంచి త్రిముఖ పోరు ఉంటుందని అంతా భావించినప్పటికీ, మళ్లీ బీజేపీ వర్సెస్ ఆర్జేడీగా మారింది. బీజేపీలో చేరిన తర్వాత సంజయ్ సింగ్ మీడియాలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. జన్ సురాజ్ పార్టీ గురించి మాట్లాడుతూ.. పార్టీ ఆలోచన మంచిదని, ప్రజలకు లాభాన్ని చేకూర్చేదని కానీ, దృఢమైన, బలమైన నాయకత్వం అవసరమని, అందుకే బీజేపీలో చేరినట్లు చెప్పారు.
ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్‌కు వరస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఆయన పార్టీ జన్ సురాజ్ తరుపున పోటీలో ఉన్న వారు క్రమంగా పోటీ నుంచి తప్పుకుంటున్నారు. అక్టోబర్ ప్రారంభంలో ముగ్గురు జన్ సురాజ్ అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహకరించుకున్నారు. వీరు ముగ్గురు దానాపూర్, బ్రహ్మపూర్, గోపాల్ గంజ్ నియోజకవర్గాల నుంచి పోటీ నుంచి బయటకు వచ్చారు. తమ అభ్యర్థుల్ని అడ్డుకునేందుకు బీజేపీ బల ప్రయోగం చేస్తోందని జన్ సురాజ్ ఆరోపిస్తోంది. గురువారం 18 జిల్లాల్లోని 121 స్థానాలకు ఓటింగ్ జరుగబోతోంది. 243 అసెంబ్లీ సీట్లు ఉన్న బీహార్ లో రెండో దశ పోలింగ్ నవంబర్ 11న, ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..