Bihar Elections Live Updates: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసానుంది.. బీహార్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 కాగా.. ఈరోజు మలి విడతలో 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ నెల 6న తొలి విడతలో 18 జిల్లాల్లో మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం విదితమే.. మలి విడతలో…
బీహర్‌లో మలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూ కట్టారు.
బీహర్‌లో మరికాసేపట్లో మలి విడత పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు.
Bihar Elections 2025: బీహార్ ఎన్నికలలో రెండవ దశ ఓటింగ్ కొన్ని ప్రాంతీయ పార్టీలకు చావోరేవోగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి బీహార్ రెండవ దశ ఎన్నికల్లో అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ పోటీలో ఉన్న చిన్న పార్టీల విజయ అవకాశాలు ఏకంగా ఎన్నికల ఫలితాన్ని మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పెద్ద పార్టీల వ్యూహాల మధ్య, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM), వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (VIP), రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), AIMIM…
బీహార్‌లో మంగళవారమే మలి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పోలింగ్ సిబ్బంది కూడా బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని 122 స్థానాల్లో నవంబర్ 11న పోలింగ్ జరుగనున్నది. రెండవ దశకు సంబంధించిన ఓటింగ్ నవంబర్ 11న ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండవ దశ ఓటింగ్‌లో NDA, మహా కూటమి రెండింటికీ చెందిన అనేక మంది ప్రముఖ నాయకుల భవిష్యత్తు తేలనుంది. ప్రచారం ముగియడంతో ఈ జిల్లాల్లో ఎలాంటి సమావేశాలు, ర్యాలీ లేదా…
ప్రజల హక్కుల కోసం మహాత్మాగాంధీలాంటి పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.
బీహార్‌లో రెండో విడత పోలింగ్ కోసం ఉధృతంగా ప్రచారం సాగుతోంది. అన్ని పార్టీలకు చెందిన అగ్ర నాయకులంతా ర్యాలీలు, బహిరంగ సభలతో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఓ వైపు ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులు ప్రచారం చేస్తుండగా.. ఇంకోవైపు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే లాంటి అగ్ర నేతలంతా ప్రచారం చేస్తున్నారు.
ఇండియా కూటమి లక్ష్యంగా మరోసారి ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సీతామర్హిలో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. యువతకు మేము ల్యాప్‌టాప్‌లు ఇస్తుంటే.. ఆర్జేడీ రివాల్వర్లు ఇస్తోందని విరుచుకుపడ్డారు. తొలి దశ ఎన్నికల్లో జంగిల్ రాజ్‌కు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు.