బీహార్‌లో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలి విడతలో భాగంగా 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటుండగా.. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: భారీ సంఖ్యలో పాల్గొనండి.. బీహార్ యువతకు రాహుల్‌గాంధీ విజ్ఞప్తి
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎక్స్‌లో బీహార్ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. ‘‘బీహార్‌లో తొలి దశ ప్రజాస్వామ్య పండుగ ప్రారంభమైంది. మొదటి దశలో ఉన్న ఓటర్లకు నా విజ్ఞప్తి ఏంటంటే.. పూర్తి ఉత్సాహంతో ఓటు వేయండి. ఇక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న రాష్ట్రంలోని యువ ఓటర్లందరికీ నా ప్రత్యేక అభినందనలు.’’ అంటూ ప్రధాని మోడీ రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Bihar Assembly Elections 2025: తొలి దశ పోలింగ్ షురూ.. బరిలో ప్రముఖులు..!
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి విడతలో 121 స్థానాల్లో గురువారం పోలింగ్ జరుగుతుండగా… వచ్చే మంగళవారం 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది. ఇక ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉండగా.. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు.
PM Narendra Modi tweets, "Today is the first phase of the festival of democracy in Bihar. My appeal to all voters in this phase is that they should vote with full enthusiasm. On this occasion, my special congratulations to all young voters of the state who are going to cast their… pic.twitter.com/wD6sGWbtNN
— ANI (@ANI) November 6, 2025