బీహార్‌లో తొలి విడత సమరానికి సిద్ధమైంది. గురువారం 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో మొదటి విడతగా పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక ఎన్నికల సిబ్బంది కూడా ఆయా బూత్‌లకు తరలివెళ్తున్నారు. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది. ఇక తొలి దశలో 1,314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Zohran Mamdani: జవహర్‌లాల్ నెహ్రూను గుర్తుచేసుకుంటూ మమ్దానీ తొలి ప్రసంగం
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ గురువారం (06-11-2025) 121 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. రెండో దశ 11-11-2025న జరగనుంది. రెండో విడతలో 122 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Story Board: బీహార్‌లో ఏ కూటమి గట్టెక్కేనో..?
ఇక రెండో విడతలో జరిగే నియోజకవర్గాల్లో ఆదివారం ప్రచారం ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలకు చెందిన నేతలంతా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రులు, బీజేపీ మంత్రులు, ఇక కాంగ్రెస్ అగ్ర నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు.