Bihar elections: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం బిహార్ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈసీని టార్గెట్ చేసుకొని వరుస విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ఎక్కడలేని ప్రాధాన్యత లభించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై.. అంతా సవ్యంగానే ఉందని ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ వస్తుంది. ఈక్రమంలో తాజాగా బిహార్‌లో ఇద్దరు పాకిస్థానీ మహిళలకు ఓటరు కార్డు జారీ కావడంతో కేంద్రం సీరియస్ అయ్యింది. దీనిపై…
EC Press Meet: ఎన్నికల కమిషన్ టార్గెట్ గా.. దేశంలో అనేక చోట్ల ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ఆరోపణలు చేశాయి.
Rahul Gandhi: బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
Voter Adhikar Yatra: బీహార్ ఎన్నికల సమరం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమీ పార్టీలు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీహార్ ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఆగస్టు 17 నుంచి బీహార్‌లో యాత్ర చేపట్టనున్నట్లు హస్తం పార్టీ పేర్కొంది. ఈ యాత్రకు ‘ఓటర్ అధికార్ యాత్ర’ అని పేరు…
Bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవరణలు చేపడుతోంది. బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 52 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించబడుతుంది. ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుంది. తొలగించిన పేర్లలో చనిపోయినట్లు నివేదించబడిన 18 లక్షల మంది ఓటర్లు, ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన 26 లక్షల మంది,…
Tejashwi Yadav: ఎన్నికల ముందు బీహార్ రాష్ట్రంలో పెరుగుతున్న హింసపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పరాస్ ఆస్పత్రి కాల్పులు, వ్యాపారవేత్త హత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న హత్యలపై బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిస్సహాయంగా ఉందని అన్నారు. ‘‘బీహార్‌ని బీజేపీ తాలిబాన్‌గా మార్చింది’’ అని ఆరోపించారు. Read Also: Liquor Scam Case: క్లైమాక్స్‌కి చేరిన లిక్కర్ స్కాం…
Bihar: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రంలో వరసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, ఆదివారం పాట్నాలోని పోలీస్ స్టేషన్ సమీపంలో, పట్టపగలు ఓ న్యాయవాదిని కాల్చి చంపారు. మరణించిన వ్యక్తిని జితేంద్ర కుమార్‌గా గుర్తించారు. అయితే, గత రెండేళ్లుగా ఇతను న్యాయవృత్తిలో చురుకుగా లేరని, ప్రాక్టీసింగ్ మానేనట్లు పోలీసులు తెలిపారు.
Asaduddin Owaisi: బీహార్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో, ఎంఐఎం పార్టీ పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఇండియా కూటమిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ.. మమ్మీ, మమ్మీ వాళ్లు మన చాక్లెట్ దొంగిలిచారు అని ఎన్నికల తర్వాత ఎవరూ ఏడవకూడదు.’’ అని ఎద్దేవా చేశారు. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిలో చేరాలని భావిస్తున్నారా.?? అని ఓవైసీని ప్రశ్నించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.