బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కీలక నిర్ణయాలు దిశగా జన్ సురాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అడుగులు వేస్తున్నారు. తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో తాను సంపాదించే దాంట్లో 90 శాతం జన్ సురాజ్ పార్టీ చొరవ కోసం విరాళంగా ఇస్తానని ప్రకటించారు.
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రికార్డ్ స్థాయిలో ఆయన 10వ సారి సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం తర్వాత, కొత్త ప్రభుత్వం ఈ రోజు కొలువుదీరింది. పాట్నా గాంధీ మైదాన్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రలు అమిత్ షా హాజరయ్యారు.
Nitish Kumar: దేశంలో నితీష్ కుమార్ రికార్డ్ సృష్టించబోతున్నారు. 10వ సారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేను పాట్నాలోని గాంధీ మైదాన్‌లో సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సహా ఎన్డీయే నేతలు హాజరుకాబోతున్నారు.
బీహార్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం తప్పేనని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఓ జాతీయ మీడియాతో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఊహించని రీతిలో ఫలితాల్లో సునామీ సృష్టించింది. గురువారమే కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ మహిళా నేత, అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. బీహార్ ఎన్నికల్లో పార్టీ పని తీరును తీవ్రంగా తప్పుబడుతూ విమర్శలు చేశారు.
Tej Pratap Yadav: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కేంద్రానికి, కేంద్ర హోం మంత్రికి అరుదైన అభ్యర్థన చేశారు. తన తల్లిదండ్రులు మానసిక వేధింపులకు గురయ్యారా అని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించాలని కేంద్రాన్ని, బీహార్ ప్రభుత్వాన్ని కోరారు. ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్ ఎన్నికల ముందు జనశక్తి జనతాదళ్ అనే పార్టీని పెట్టి, మహువా నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Bihar Politics: బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిని ముందుండి నడిపించిన, సీఎం అభ్యర్థిగా ఉన్న తేజస్వీ యాదవ్ ఒకానొక దశలో ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది, చివరకు స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ కేవలం 25 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మహాఘట్బంధన్ కూటమి కేవలం 35 సీట్లను మా
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నో ప్రగల్భాలు పలికారు. జేడీయూ 25 సీట్లు కంటే ఎక్కువ గెలవదని.. అసలు అధికార కూటమి ఘోరంగా ఓడిపోబోతుందని.. జేడీయూ 25 సీట్లు కంటే ఎక్కువ గెలిస్తే రాజీనామా చేస్తానని ఎన్నో ప్రెస్‌మీట్‌ల్లో చెప్పుకొచ్చారు.
బీహార్ ప్రజల విశ్వాసాన్ని జన్ సురాజ్ పార్టీ గెలుచుకోలేకపోయిందని ఆ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు.