2025 అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ ప్రజలపై ఆర్జేడీ నేత, మహా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వరాల జల్లు కురిపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు రూ.30,000 ఒకేసారి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలానే రైతులకు పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, వరిపై 300 రూపాయలు, గోధుమలపై 400 రూపాయలు బోనస్ అందిస్తామని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచారం చివరి దశకు…
PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ప్రధాని నరేంద్రమోడీ తన ప్రచారాన్ని తీవ్రం చేశారు. సోమవారం, ప్రధాని మోడీ ఆర్జేడీ పార్టీపై లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం ప్రతిపక్ష ఇండి కూటమి నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌లను ‘‘పప్పు, తప్పు, అక్కు’’గా ప్రస్తావించారు.
Asaduddin Owaisi: బీహార్ ఎన్నికలకు మరో కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అందరు నేతలు ప్రచారాన్ని తీవ్రం చేశారు. తాజాగా, ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ యాదవ్, ఓవైసీని ‘‘ఉగ్రవాది’’గా పిలవడం కొత్త వివాదానికి కారణమైంది. దీనిపై ఓవైసీ స్పందిస్తూ.. ‘‘బాబు ఉగ్రవాది(extremist)ని ఇంగ్లీషులో రాయగలరా..?’’ అంటూ సెటైర్లు వేశారు.
బీహార్‌లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు.
బీహార్‌లో తొలి విడత పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. గురువారమే మొదటి విడత పోలింగ్ జరగనుంది. దీంతో మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. దీంతో ప్రచారానికి సమయం లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి.
PM Modi:ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత దేశం తన సైన్యాన్ని చూసి గర్వపడిందని, కానీ కాంగ్రెస్-ఆర్జేడీ దానిని ఇష్టపడటం లేదని ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. బీహార్‌లోని అర్రాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. రెండు పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్‌లో పేలుళ్లు జరిగితే, కాంగ్రెస్ రాజకుటుంబం నిద్ర కోల్పోతోంది. ఆపరేషన్ సిందూర్ షాక్ నుంచి పాకిస్తాన్, కాంగ్రెస్ కోలుకోలేదు’’ అని గాంధీ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు.
Bihar Elections: బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడుతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు తెలుస్తాయి. ఇదిలా ఉంటే, బీజేపీ గురించి తెలుసుకోవడానికి పార్టీ అధ్యక్షుడు ప్రారంభించిన ‘‘Know BJP’’ ప్రచార కార్యక్రమంలో భాగంగా 7 దేశాలకు చెందిన దౌత్యవేత్తల బృందం ఆదివారం బీహార్ సందర్శిస్తోంది.
Bihar Elections 2025: బీహార్ ఎన్నికల ముందు హత్యా రాజకీయాలు సంచలనంగా మారాయి. గురువారం, ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ కార్యకర్త దులార్ చంద్ యాదవ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఆదివారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే, మోకామా నుంచి పోటీ చేస్తున్న జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.