Nitish Kumar: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎన్నికల ముందు సీఎం నితీష్ కుమార్ బీహార్ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. 2005లో తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి తాను ‘‘నిజాయితీగా కష్టపడి పనిచేయడం ’’ ద్వారా ప్రజలకు సేవ చేశానని అన్నారు. మూడు నిమిషాల వీడియోలో.. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 2005కు ముందు బీహారీగా ఉండటం అవమానకరమైన విషయంగా ఉండేదని చెప్పారు.
బీహార్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తాజాగా బీహారీయులను ఉద్దేశించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక సందేశాన్ని విడుదల చేశారు. తానెప్పుడూ కుటుంబం కోసం పని చేయలేదని.. 2005లో ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు బీహార్ ప్రజల కోసం నిజాయితీగా.. కష్టపడి సేవ చేసినట్లుగా వివరించారు.
ప్రముఖ సినీ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదికి ఫోన్ చేసి ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ మత విశ్వాసాల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బెదిరింపు కాల్ చేశాడు. దీంతో గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో శివం ద్వివేది ఫిర్యాదు చేశాడు.
బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల వ్యూహాకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీకి 150 సీట్లు వస్తాయని.. లేదంటే 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు.
DMK: డీఎంకే ప్రభుత్వం బీహార్ ప్రజల్ని వేధిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించిన ఒక రోజు తర్వాత, డీఎంకే పార్టీ ప్రధానిపై విరుచుకుపడింది. డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతీ ప్రధాని మోడీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమిళనాడును అవమానించిందని, నిధుల కేటాయింపులో రాష్ట్రం పట్ల కేంద్ర వివక్ష చూపుతోందని ఆరోపించారు. మోడీవి విభజన రాజకీయాలని, బ్రిటీష్ పాలన కన్నా దారుణంగా ఉందని ఆయన విమర్శించారు. Read Also: JD Vance – Usha: అమెరికా ఉపాధ్యక్షుడి…
బీహార్ ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ‘సంకల్ప్ పత్ర’ పేరుతో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. శుక్రవారం పాట్నాలో కేంద్ర మంత్రులు జేడీ నడ్డా, జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్, సీఎం నితీష్ కుమార్, ఆర్‌ఎల్‌ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహ తదితరులు ఎన్నికల హామీ పత్రాన్ని విడుదల చేశారు.
బీహార్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రులు విరామం లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని అగౌరపరిచేవిగా, ‘‘మర్యాద అన్ని హద్దులు దాటాయి’’ అని బీజేపీ పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగమైనవని, ఎగతాళి చేసేవిగా ఉన్నాయని, భారత గణతంత్ర రాజ్య అత్యున్నత రాజ్యాంగ కార్యాలయ గౌరవాన్ని అవమానించే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయని చెప్పింది.
Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో హత్యా రాజకీయాలు కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఒక నాయకుడు తూటాకు బలైన ఘటన గురువారం పాట్నా జిల్లాలోని మోకామా తాల్ ప్రాంతంలో వెలుగు చూసింది. జన్సురాజ్ అభ్యర్థి పియూష్ ప్రియదర్శి మద్దతుదారుడు ఆర్జేడీ మాజీ నాయకుడు దులార్‌చంద్ యాదవ్ గురువారం రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కాల్పుల్లో కాల్చి చంపబడ్డాడు. దులార్‌చంద్ యాదవ్ పియూష్ ప్రియదర్శికి మద్దతుగా తన మద్దతుదారులతో ప్రచారం చేస్తుండగా ఈ సంఘటన…
PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై విరుచుకుపడ్డారు. ‘‘అవినీతికి పాల్పడిన యువరాజులు’’ అని పిలిచారు. వీరిద్దరు ‘‘తప్పుదు హామీల దుకాణం’’ నడుపుతున్నారని ఆరోపించారు. బీహార్ లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన మెగా ర్యాలీలో గురువారం ప్రధాని మోడీ పాల్గొన్నారు. Read Also: Rules change November 1: ఆధార్ అప్‌డేట్ నుంచి LPG, క్రెడిట్ కార్డ్ వరకు.. నవంబర్ 1…