విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తుక్కుగూడ మున్సిపాలిటీలో కూరగాయలు అమ్ముతున్న బాలుడిని గుర్తించి పాఠశాలకు వెళ్లేలా చూడాలని బాలుడి తండ్రితో మాట్లాడారు. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సోమవారం తుక్కుగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఆమె అక్కడకు చేరుకున్నారు. అయితే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం బాలుడిని చూసిన మంత్రి ఆ బాలుడితో ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సదరు బాలుడిని ఏ స్కూల్‌లో చదువుతున్నావని అడిగే తాను మోడల్ స్కూల్‌లో…
ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వివిధ ప్రాంతాల నుండి టీఎస్‌ఆర్టీసీ వరంగల్ రీజియన్ ద్వారా సుమారు 2,200 బస్సులు నడపబడతాయని, గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని మూడు పాయింట్ల నుంచి 900 బస్సులు నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హైదరాబాద్, కరీంనగర్ జోన్లు) పీవీ మునిశేఖర్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మునిశేఖర్ తెలిపారు. ఈ ద్వైవార్షిక జాతర కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో బీజేపీ నేతలు, టీఆర్‌ఎస్ నేతలు ఒకరిపైఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన ట్విట్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. “పోలీసులను 15 నిమిషాలు తొలగిస్తే, మేము ముస్లింలు 100 కోట్ల హిందువులను అంతం చేస్తాం” అన్న ఒవైసీ, ఎంఐఎంతో సీఎం కేసీఆర్ , కేటీఆర్ లు కలిసి పొత్తుపెట్టుకోవడం…
ఇటీవల కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంబేద్కర్ పెట్టిన బిక్ష అని అన్నారు. అంతేకాకుండాఅలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని ఎలా అనిపించిందని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా రాజ్యాంగము ఏ ఒక్కరిదీ కాదని, అందరికీ సమనాహక్కులు కల్పించింది రాజ్యాంగమని ఆమె వెల్లడించారు. రాజ్యాంగము మార్చాలనే అహంకారం ఎక్కడి నుండి వచ్చిందని ఆమె మండిపడ్డారు. కావాలంటే ఆమైంద్ మేంట్స్…
మహిళను బానిస లాగా చూస్తున్నప్పుడు.. వారికి హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ ది అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. . ఆస్తిలో హక్కులు కల్పించి లింగ వివక్ష లేకుండా చేసింది రాజ్యాంగము అని, రాజ్యాంగము మార్చడానికి నువ్వెవడు అని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలని అనుకుంటున్నావు కేసీఆర్, అందరికీ సమాన హక్కులు..వాక్ స్వతంత్రం.. భావ స్వేచ్ఛ కల్పించినందుకు మార్చాలని అనుకుంటున్నావా..? అని ఆయన ఆరోపించారు. మోడీ పర్యటన.. అంతా రామానుజ చార్యుల…
బడ్జెట్ పై అవగాహన కల్పించేందుకు విజయవాడలో నేడు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, కోవిడ్ వల్ల ప్రాణాలతో పాటు ఆర్ధికంగా నష్టపోయామని, థర్డ్ వేవ్ వచ్చినా వ్యాక్సిన్ అందించడం వల్లే ప్రాణ నష్టం జరగలేదని ఆయన అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో చాలా ప్రాధాన్యత గల బడ్జెట్…
ప్రభుత్వంతో ఉపాధ్యాయుల చర్చలు విఫలమయ్యాయ యూటీఎఫ్ రాష్ట్ర అధక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపై వచ్చి పోరాడతామని, ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి చర్చలు ఆమోదయోగ్యం కాదని, ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి కార్యచరణ ప్రకటిస్తామని ఆయన అన్నారు. హెచ్ఆర్ఏ, ఫిట్మెంట్ విషయాల్లో తీవ్రంగా విభేదించామని, ప్రభుత్వం టీచర్లుకు 10 శాతమే హెచ్ఆర్ఏ ఇస్తామంటోందని ఆయన మండిపడ్డారు. కనీసం 12 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని, మార్పులు చేయకపోతే పాత హెచ్ఆర్ఏ కొనసాగించాలని ఆయన కోరారు. ఫిట్మెంట్ విషయంలో…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టినంక మొట్టమొదట మోసం చేసింది దళితులనేని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే దళితుడినే మొదటి ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచినంక మాట తప్పిండని ఆయన అన్నారు. తానే సీఎం పదవి చేపట్టి దళితులను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని, దళితుడికి సీఎం పదవి ఏమైందని జనం నిలదీస్తుంటే… చర్చను దారి మళ్లించేందుకు…
థర్డ్ వేవ్ రూపంలో ప్రజలపై విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి శాంతిస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 1,07,474 కొత్త కోవిడ్-19 కేసులు 865 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం సంఖ్య 4,21,88,138కి చేరుకోగా, మృతుల సంఖ్య 5,01,979కి చేరింది. యాక్టివ్ కాసేలోడ్ 12,25,011కి పెరిగింది. ఇది ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 2.90 శాతం. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.42 శాతానికి…
చాప్రౌలీ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న ఎంఐఎం అభ్యర్థి అనీస్ అహ్మద్‌కు మద్దతుగా అసరా గ్రామంలో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నాడు మహాత్మాగాంధీని హత్య చేసిన వారే ఇప్పుడు తనపైనా దాడి చేశారని అన్నారు. తాను వాస్తవాలు మాట్లాడుతుండడం, బీజేపీ కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం చేస్తుండడంతోనే తనపై కాల్పులు జరిపారని ఆయన మండిపడ్డారు. తనపై కాల్పులు జరిపిన వారే గాంధీ హత్య వెనక కూడా…