విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తుక్కుగూడ మున్సిపాలిటీలో కూరగాయలు అమ్ముతున్న బాలుడిని గుర్తించి పాఠశాలకు వెళ్లేలా చూడాలని బాలుడి తండ్రితో మాట్లాడారు. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సోమవారం తుక్కుగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఆమె అక్కడకు చేరుకున్నారు. అయితే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం బాలుడిని చూసిన మంత్రి ఆ బాలుడితో ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సదరు బాలుడిని ఏ స్కూల్‌లో చదువుతున్నావని అడిగే తాను మోడల్ స్కూల్‌లో చదువుతున్నానని చెప్పడంతో.. మరి ఈ రోజు స్కూల్ ఎందుకు పోలేదని విచారించింది. దీంతో సదరు బాలుడు కుంటిసాకులు చెప్పడంతో.. స్కూల్‌కు వెళితే.. ఇలా రోడ్డుపై నిలబడే పరిస్థితి రాదని.. బుద్ధిగా చదువుకోవాలని బాలుడిని ఎంతో అప్యాయంగా దగ్గరకు తీసుకొని చెప్పారు. అంతేకాకుండా సదరు బాలుడి ఊరు సర్పంచ్‌తో పాటు బాలుడి తండ్రితో మాట్లాడి బాలుడిని స్కూల్‌కు పంపించాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#SabithaIndrareddy @SabithaindraTRS @sabitha pic.twitter.com/sXvZ9mPCC9
— Krishna Gogikar (Journalist) (@Krishna614) February 7, 2022