ప్రభుత్వంతో ఉపాధ్యాయుల చర్చలు విఫలమయ్యాయ యూటీఎఫ్ రాష్ట్ర అధక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపై వచ్చి పోరాడతామని, ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి చర్చలు ఆమోదయోగ్యం కాదని, ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి కార్యచరణ ప్రకటిస్తామని ఆయన అన్నారు. హెచ్ఆర్ఏ, ఫిట్మెంట్ విషయాల్లో తీవ్రంగా విభేదించామని, ప్రభుత్వం టీచర్లుకు 10 శాతమే హెచ్ఆర్ఏ ఇస్తామంటోందని ఆయన మండిపడ్డారు.
కనీసం 12 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని, మార్పులు చేయకపోతే పాత హెచ్ఆర్ఏ కొనసాగించాలని ఆయన కోరారు. ఫిట్మెంట్ విషయంలో ప్రభుత్వం స్పందించట్లేదని, టీచర్లకు 27 శాతానికి పైగా ఫిట్మెంట్ కోరుతున్నామని ఆయన అన్నారు. అంతేకాకుండా ఫిట్మెంట్ విషయమై సీఎం వద్ద ప్రస్తావిస్తామని చెప్పినా అవకాశం ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. సీపీఎస్కు సంబంధించి ప్రభుత్వ వైఖరి స్పష్టంగా చెప్పాలని ఆయన అన్నారు.