ఇటీవల కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంబేద్కర్ పెట్టిన బిక్ష అని అన్నారు. అంతేకాకుండా
అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని ఎలా అనిపించిందని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా రాజ్యాంగము ఏ ఒక్కరిదీ కాదని, అందరికీ సమనాహక్కులు కల్పించింది రాజ్యాంగమని ఆమె వెల్లడించారు.
రాజ్యాంగము మార్చాలనే అహంకారం ఎక్కడి నుండి వచ్చిందని ఆమె మండిపడ్డారు. కావాలంటే ఆమైంద్ మేంట్స్ అడుగు.. కానీ రాజ్యాంగం మార్చాలని అనడం సరికాదు అని ఆమె హితవు పలికారు. కొత్త రాజ్యాంగము లో ఎస్సీ, ఎస్టీ ల రిజర్వేషన్ లేకుండా చేయాలని అనుకుంటున్నావా..? అని ఆమె ప్రశ్నించారు. నీ ఒక్కడి కుటుంబం కోసమే రాజ్యాంగం రాయించుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని వస్తె కూడా వెళ్ళలేదు కేసీఆర్.. జ్వరం వచ్చింది అని అబద్దం ఆడారు కేసీఆర్ అని ఆమె విమర్శించారు.