బడ్జెట్ పై అవగాహన కల్పించేందుకు విజయవాడలో నేడు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, కోవిడ్ వల్ల ప్రాణాలతో పాటు ఆర్ధికంగా నష్టపోయామని, థర్డ్ వేవ్ వచ్చినా వ్యాక్సిన్ అందించడం వల్లే ప్రాణ నష్టం జరగలేదని ఆయన అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో చాలా ప్రాధాన్యత గల బడ్జెట్ తెచ్చామని, రైతులు, ఇతర అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఎమ్మెఎస్ఎఈ స్కీం కింద రూ. 4.5 లక్షల కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు. గత రెండేళ్లుగా ఆత్మ నిర్బర్ భారత్ కింద రూ. 2.28 కోట్లు ఇచ్చామని, హోటల్స్, రెస్టారెంట్ల ఏర్పాటుకు లోన్ల సౌకర్యం, వ్యవసాయ ప్రాధాన్యతతో పాటు చిన్న తరహా ప్రొడక్టు లింక్ ఇన్సెంటివ్ స్కీం. వైద్య శాలలు ఏర్పాటు ద్వారా 60 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నామన్నారు.
రూ. 19, 500 కోట్లు ప్రధాన మంత్రి గతి శక్తి కింద కేటాయించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు, రైల్వే, పోర్ట్ లాజిస్టిక్స్ ఎయిర్ పోర్ట్ వంటి ఆరు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. గతి శక్తి వల్ల పారిశ్రామిక అభివృధ్ధితో ఉద్యోగాలు పెరుగుతాయని అన్నారు. 400 వందే మాతరం రైళ్లు రానున్న 3 ఏళ్లలో నడుపుతామని ఆయన తెలిపారు. కొండ ప్రాంతాల్లో పర్వత మాల స్కీంతో రోప్ వేస్. గ్రామీణ ఆర్ధిక వ్యవసాయం అభివృద్ధి. భూ రికార్డులను పూర్తి స్థాయిలో డిజిటల్ చేస్తున్నాం. వైద్యానికి నేషనల్ టెలి హెల్త్ సెంటర్లు 23 ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ భారతంలో పోస్టాఫీసులు ద్వారా బ్యాంకింగ్ సేవలు. క్రిప్టో కరెన్సు అనుమతించాం.. కొందరు మదుపు చేశారు. 30 శాతం పన్ను చెల్లించి చట్టబద్దం చేసుకోవచ్చు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాకుండా దేశ ప్రజలు అందరికీ ఉపయోగపడే బడ్జెట్ ఇది అని ఆయన పేర్కొన్నారు.