తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టినంక మొట్టమొదట మోసం చేసింది దళితులనేని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే దళితుడినే మొదటి ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచినంక మాట తప్పిండని ఆయన అన్నారు. తానే సీఎం పదవి చేపట్టి దళితులను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని, దళితుడికి సీఎం పదవి ఏమైందని జనం నిలదీస్తుంటే… చర్చను దారి మళ్లించేందుకు ఒక్కో దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని మాయ మాటలు చెప్పిండు అని ఆయన ఆరోపించారు. దళితులకు మూడెకరాల సంగతి దేవుడెరుగు…. వాళ్ల పేరిటనున్న అసైన్డ్ భూములను కూడా లాక్కున్న నీచమైన చరిత్ర కేసీఆర్ ది అని మండిపడ్డారు.
ఇదేం పద్దతని సీఎంను అందరూ తిడుతుంటే… మళ్లీ ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కాగా అమలు చేస్తామన్నడు. ఆ హామీని కూడా గాలికొదిలేసిండు. హుజూరాబాద్ ఎలక్షన్లు రాంగనే మళ్లా ‘దళిత బంధు’ పేరుతో దళితులందరికీ ఒక్కొక్కరికీ 10 లక్షల రూపాయలిస్తానంటూ మాయమాటలు చెప్పిండు. కేసీఆర్ మాయమాటలను దళితులు కాదు కదా జనం నమ్మలేదు. కర్రుకాల్చి వాత పెట్టిండ్రు. వందల కోట్లు ఖర్చు పెట్టినా ఓడించిండ్రు అని ఆయన వ్యాఖ్యానించారు.