రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృవియోగం కలిగింది. మంత్రి సత్యవతి తండ్రి లింగ్యా నాయక్ (85) ఈ రోజు ఉదయం పరమపదించారు. అయితే గత కొంతకాలంగా లింగ్యా నాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని నివాసంలో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. అయితే మంత్రి సత్యవతి రాథోడ్ మేడారం సమ్మక్క-సారక్క జాతర పర్యవేక్షణలో ఉన్నారు. తండ్రి మరణవార్త తెలియడంతో ఆమె…
2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వరదలతో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని నేడు సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. జగన్ బటన్‌నొక్కి నేరుగా 5.17 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.534.77 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద…
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నేను “గిప్పని ఇస్తా” అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి అని యుట్యూబ్ నటి సరయు అన్నారు. ఇటీవల ఆమె నటించిన షార్ట్ ఫిల్మ్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లు ఆరోపణలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనల్ని అర్దం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఓ హిందు కుటుంబంలో పుట్టాను.. నేను ఎలా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా నటిస్తానని ఆమె అన్నారు.…
ప్రధాని మోడీ ఇటీవల పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ప్రధాని హైదరాబాద్‌కు వచ్చినపుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి జ్వరం ఉందని వెళ్లకపోతే అది మనసులో పెట్టుకుని తెలంగాణపై విషం కక్కుతున్నారని అన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ దీనిని తీవ్ర పరిణామంగా తీసుకుని నిరసన తెలపాలని, కేసిఆర్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారని, కేసీఆర్ వల్ల తనకు, తన…
ప్రధాని మోడీ ఇటీవల పార్లమెంట్‌లో చేసిన వివాదస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు ప్రధాని వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అంతేకాకుండా ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మోడీ దేశానికి ఏం చేశాం అనేది చెప్పకుండా నెహ్రూ మీద మాట్లాడారని, మోడీ మాటలు వింటుంటే సిగ్గు అనిపిస్తుందని ఆయన విమర్శించారు. మోడీ ప్రధాని లాగా కాకుండా..…
రాజ్యసభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరోసారి రుజువైందని ఆయన అన్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి ఈరోజు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరం, ఆక్షేపణీయమని ఎర్రబెల్లి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయి. దేశ సమాఖ్య స్ఫూర్తికి మోడీ వ్యాఖ్యలు పూర్తిగా వ్యతిరేకమని, ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఏమాత్రం నమ్మకం లేదని తేలిపోయిందని ఆయన అన్నారు. తెలంగాణపై బీజేపీకి మోడీకి ఎందుకంత…
ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. మళ్లీ తెలంగాణపై మోడీ అక్కసు వెళ్లగక్కారని, తెలంగాణ మీద ఎందుకు అంత వివక్ష.. ఎందుకు అంత కక్ష.. ఎందుకు అంత విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యసభలో మోడీ మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచిందని, రాష్ట్ర ఏర్పాటును అయన ఎంత వ్యతిరేకిస్తున్నరో అర్థం అవుతున్నదని ఆయన అన్నారు. మోడీ…
కరోనా నేపథ్యంలో మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టుతుండడంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను పునఃప్రారంభించాయి. అయితే కరోనా నిబంధనలను మాత్రం కట్టుదిట్టంగా అమలు చేస్తూ.. విద్యాసంస్థలు నిర్వహించాలని ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కరోనా సెలవుల్లో జరగాల్సిన పరీక్షలు, పరీక్షా ఫీజు చెల్లింపులల్లో గందరగోళం నెలకొంది. దీంతో తాజా యూజీ 1, 3…
ట్విట్టర్ వేదికగా టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు వార్ నడుస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ దుమారం రేపుతుండగా దానికి కౌంటర్‌గా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ ట్వీట్‌పై ఉదయం కిషన్‌రెడ్డి ట్విట్టర్‌లో.. ఎంఐఎంతో ఎవరు చేతులు కలిపినా వాళ్ల వ్యాఖ్యల్ని సమర్థించినట్టేనన్నారు. సబ్ కా సాథ్, సబ్‌కా వికాస్ లక్ష్యంగా వెళ్తున్న మోడీని విమర్శిస్తురా..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ట్విట్టర్లోనే కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.…
తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 20 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 21 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 20న తెలుగు మొదటి సంవత్సరం పరీక్ష, ఏప్రిల్ 22 మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష జరగనున్నాయి. ఏప్రిల్ 25…