మహిళను బానిస లాగా చూస్తున్నప్పుడు.. వారికి హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ ది అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. . ఆస్తిలో హక్కులు కల్పించి లింగ వివక్ష లేకుండా చేసింది రాజ్యాంగము అని, రాజ్యాంగము మార్చడానికి నువ్వెవడు అని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలని అనుకుంటున్నావు కేసీఆర్, అందరికీ సమాన హక్కులు..వాక్ స్వతంత్రం.. భావ స్వేచ్ఛ కల్పించినందుకు మార్చాలని అనుకుంటున్నావా..? అని ఆయన ఆరోపించారు. మోడీ పర్యటన.. అంతా రామానుజ చార్యుల స్పూర్తికి భిన్నంగా సాగిందని, సమతా మూర్తి సిద్దాంతం ప్రచారం కోసం కాకుండా… బీజేపీ ప్రచారం మాదిరిగా సాగిందని ఆయన విమర్శించారు.
రామానుజ చార్యుల సిద్దాంతం కాకుండా… బీజేపీ సిద్దాంతం చెప్పారు మోడీ అని ఆయన ఎద్దేవా చేశారు. మోడీకి స్వాగతం నుండి మొదలుకుని… సెండ్ ఆఫ్ వరకు..అంతా బీజేపీ నేతలేనని, మోడీ తీరు..రామానుజ చార్యులకు అవమానం గా ఉందన్నారు. అన్ని మతాలు.. కులాలు సమానం అని చెప్పిన మానవతా మూర్తి రామానుజ చార్యులని, దానికి భిన్నమైన విధానం మోడీ ది అని ఆయన అన్నారు. రామానుజ చార్యులతో పాటు… తెలంగాణకి అవమానం జరిగిందన్నారు. అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన బాధ్యత అని, ఏ వర్గం అక్కడికి రాకుండా చేసుకుని… రామానుజ ఫిలాసఫీ కూడా రాజకీయ లబ్దికి వాడుకున్నారన్నారు.