రాజ్యాంగం మీద ప్రమాణము చేసిన వ్యక్తి మాట మార్చడం అనేది సరి కాదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాజ్యాంగం వ్యతిరేకించిన వ్యక్తులు కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగం ద్వారానే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. కొత్త రాజ్యాంగం కావాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాదన్నట్లే కదా అని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 65 సార్లు హై కోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కేసులు నిరూపించుకో అని కేసీఆర్ కు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి గా ఉండగానే ఈ డీ అధికారులు కేసీఆర్ దగ్గరకు వచ్చారని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాలు సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. అసలు కొత్త రాజ్యాంగం ఎందుకో కేసీఆర్ సమాధానం చెప్పాలని, నీ కుటుంబ సభ్యులు పాలించడానికేనా కొత్త రాజ్యాంగం అని ఆయన ఎద్దేవా చేశారు. నువ్వు పార్టీ పెట్టె ముందు తెలంగాణ గురించి ఎప్పుడైనా మాట్లాడవా, నయీం కేసు ఏమి అయింది, ఇప్పటి వరకు ఇక్కడ వెలగపెట్టి.. ఇప్పుడు దేశం గురించి మాట్లాడతావా.. కేసీఆర్ మాట్లాడిన మాటలు దేశ ద్రోహం, రాజ్యాంగ ధిక్కరణ కింద వస్తాయి అని ఆయన వ్యాఖ్యానించారు.