Madhya Pradesh: పేదలు వెళ్లే ప్రభుత్వ ఆస్పత్రులంటే ప్రభుత్వాలకే కాదు.. కుక్కలకూ లోకువే.. రోగులు ఎవరు లేరని చూసి ఏం చక్కా బెడ్లపై రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా షాపురాలోని ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లో వీధి కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఎంచక్కా రోగుల బెడ్లపై అవి నిద్రిస్తున్నాయి. స్థానిక నివాసి అయిన సిద్ధార్థ్ జైన్ దీనిని తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.
Read Also: Kamareddy Tragedy : కామారెడ్డిలో విషాదం.. సెల్ టవర్ పై ఉరేసుకున్న అన్నదాత
ప్రభుత్వ ఆస్పత్రులంటే సరైన సదుపాయాలు అసలు ఉండవు. అపరిశుభ్రంగా ఉంటాయి. అందుకే చాలామంది ప్రభుత్వ ఆస్పత్రులంటే భయపడుతుంటారు. అక్కడకు వెళ్లాంటేనే హడలిపోతారు. ఖర్చు ఎక్కువైనా ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్తుంటారు. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రులు ఎలాంటి స్థితిలో ఉంటాయో తెలియజేసేలా వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే దీనిపై జబల్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంజయ్ మిశ్రా స్పందించారు. సంబంధిత ఆస్పత్రి ఇంచార్జ్ అధికారికి నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు చేసి విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు సెప్టెంబర్లో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. రత్లామ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూ వార్డులోని బెడ్‌పై కుక్క నిద్రిస్తున్న వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.