Indigo Flight: ఢిల్లీకి కేరళలోని కొచ్చిన్ నుంచి ఇండిగో విమానం బయలుదేరింది. కానీ విమానంలోని ఓ ప్రయాణికుడి ఆరోగ్యం విషమించడంతో విమానాశ్రయ అధికారులు భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి చెందిన 6ఈ2407 విమానం కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నది. అయితే విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడి ఆరోగ్యం విషమించింది. దీంతో సిబ్బంది విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అత్యవసర పరిస్థితిలో విమానాన్ని భోపాల్‌కు దారిమళ్లించారు. అప్పటికే ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న సిబ్బంది.. ప్రయాణికుడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే దీనివల్ల ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో వెళ్లడించింది. మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో విమానాన్ని భోపాల్‌కు దారిమళ్లించినట్లు తెలిపింది.
Aviation Cares – Today Indigo Flight No.6E-2407 Kochi to Delhi did an medical emergency landing at Bhopal Airport, without wasting a second Bhopal Airport's team ( AAI,CISF & Indigo) quickly offboarded the passanger and shifted him safely to the nearest hospital.@AAI_Official
— Bhopal Airport (@aaibplairport) February 24, 2023