Fire In Vande Bharat Train :వందేభారత్ రైలులో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందేభారత్ రైలులో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్‌లోని కుర్వాయి కేతోరా స్టేషన్ దగ్గర ఉదయం ఈ ఘటన జరిగింది.. రైలులో మంటలను గమనించిన సిబ్బంది వెంటనే లోకోపైలట్ కు సమాచారం అందించారు. దీంతో రైలుని అక్కడికక్కడే నిలిపేశారు. రైలులోని సీ 14 కోచ్ వద్ద మంటలు వ్యాపించాయి. దీంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు.ట్రైన్ చక్రాల దగ్గర నుండి పొగలు కమ్ముకున్నట్లు సంఘటన స్థలం నుండి వచ్చిన దృశ్యాలు చూపించాయి. రైలులో అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు..
ఈ మంటలు బ్యాటరీ బాక్సుకే పరిమితమైనట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక పరీక్ష ముగిసిన వెంటనే రైలు దేశ రాజధానికి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని,వారికి ఎటువంటి గాయాలు సంభవించలేదని సమాచారం.ఈ రైలు ఉదయం 5.40 గంటలకు భోపాల్ నుండి బయలుదేరి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు మధ్యాహ్నం 1.10 గంటలకు ఢిల్లీకి చేరుకోనుంది..
Also Read
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
ప్రధాని మోదీ సర్కార్ ఆర్భాటంగా ప్రారంభించిన వందే భారత్ రైలు తరచూ ప్రమాదాలకు గురవుతుంది. అక్కడ ఆవును ఢీకొన్నది.. ఇక్కడ బర్రెను ఢీకొట్టింది వంటి వార్తలను వింటూనే ఉన్నాం. ప్రమాదాల్లో రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతినడం వంటి ఘటనలు కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం ప్రకారం..గత ఏడాది జూన్ మరియు డిసెంబర్ మధ్య, వందేభారత్ రైళ్లలో జంతువులు ఢీకొన్న 68 కేసులు నమోదయ్యాయి.వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
#WATCH | Madhya Pradesh | A fire was reported in battery box of one of the coaches in a Vande Bharat Express at Kurwai Kethora station. Fire brigade reached the site and extinguished the fire. All passengers are safe. No injuries reported. The fire is limited to Battery Box Only.… pic.twitter.com/E2s9ED99VH
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023
తాజావార్తలు
-
Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!”.
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!