Madhya Pradesh: దారుణం.. చేతులు వెనక్కి కట్టి.. వృద్ధురాలని చితక్కొట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ వృద్ధురాలిని ముగ్గురు వ్యక్తులు తాళ్లతో కట్టేసి కొట్టారు. ఆమెను కులం పేరుతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధురాలిని కొట్టిన ఘటనపై ఖర్గోన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ వృద్ధురాలిని చేతులు కట్టేసి ముగ్గురు వ్యక్తులు ఆమెపై విచక్షణా రహితంగా దాడికిపాల్పడ్డారు. హీరాపూర్‌కు చెందిన గిరిజన మహిళకు ఓ కుమారుడు ఉన్నాడు. అతడు పొట్టకూటికోసం ఇండోర్‌లో కూలి పనులు చేస్తూ జీవనం గడుతున్నాడు. దీంతో ఆమె హిరపూర్‌లోని తమ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నది. అయితే పక్కింట్లో ఉండే గణేశ్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమెను దూషిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పూటుగా తాగొచ్చిన గణేశ్.. నేరుగా ఆమె ఇంట్లోకి వెళ్లి తిట్టడం మొదలు పెట్టాడు. అడ్డుకున్న ఆమెను కులం పేరుతో దూషించాడు.
Read Also: Earth Quake: నిజామాబాద్ జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
గొడవ పెద్దదవడంతో గణేశ్.. భార్య, తల్లి అతనికి తోడయ్యారు. ముగ్గురూ కలిసి ఆ వృద్ధురాలిని ఇంటి నుంచి బయటకు గుంజుకొచ్చారు. రెండు చేతులు వెనక్కి విరిచి తాడుతో కట్టేశారు. అనంతరం ఆమెపై విచక్షణా రహితంగా దాడికి పల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమె స్థానికుల సహాయంతో పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు మహిళలతో పాటు మరో వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలపై దాడుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని వివరించారు. ఆ వృద్ధురాలి ఏ తప్పూ చేయకుండానే స్థానికులు ఆమెతో గొడవ పెట్టుకున్నారని పోలీసులు గుర్తించారు. వృద్ధురాలి కులాన్ని ప్రస్తావిస్తూ తిట్టారని చెప్పారు.
An elderly woman was tied with a rope and thrashed by a group of people while hurling casteist remarks at her at a village in #MadhyaPradesh's #Khargone district. pic.twitter.com/Ju7dm7vTGz
— Hate Detector 🔍 (@HateDetectors) February 5, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!