High Court: మగ స్నేహితుడితో భార్య అసభ్యకరమైన చాటింగ్.. భర్త సహించలేడన్న హైకోర్ట్..
- మగ స్నేహితుడితో భార్య అసభ్యకరమైన చాటింగ్..
- అలాంటివి భర్త సహించలేడన్న హైకోర్టు..
- విడాకులు ఇస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: పెళ్లి తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో ‘‘అసభ్యకకరమైన’’ సంభాషణల్లో పాల్గొనకూడదని, ఏ భర్త తన భార్య నుంచి అలాంటి చాటింగ్‌ని సహించలేడని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. విడాకులకు అనుమతి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భర్తపై భార్య క్రూరత్వం కారణంగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టు న్యాయమూర్తులు వివేక్ రొసియా, జస్టిస్ గజేంద్ర సింగ్‌లతో కూడిన ధర్మాసనం సమర్థించింది.
సదరు మహిళ తన మగ స్నేహితుడితో తన లైంగిక జీవితం గురించి చాట్ చేస్తున్నట్లు కోర్టు గమనించింది. అలాంటి ప్రవర్తన గురించి ఏ భర్త కూడా సహించడని కోర్టు పేర్కొంది. ‘‘తన భార్య మొబైల్ ద్వారా ఈ రకమైన అసభ్యకరమైన సంభాషణలో ఉండటం ఏ భర్త సహించడు’’ అని చెప్పింది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
Read Also: Breaking News: పాకిస్తాన్‌లో మరో దాడి.. మసీదులో బాంబ్ బ్లాస్ట్..
‘‘వివాహం తర్వాత, భార్యాభర్తలు ఇద్దరూ మొబైల్, చాటింగ్ మరియు ఇతర మార్గాల ద్వారా స్నేహితులతో సంభాషించే స్వేచ్ఛను కలిగి ఉంటారు, కానీ సంభాషణ స్థాయి మర్యాదగా, గౌరవంగా ఉండాలి, ముఖ్యంగా ఆపోజిట్ జెండర్ చెందిన వారితో ఉన్నప్పుడు అభ్యంతరకరంగా ఉండొద్దు’’ అని కోర్టు చెప్పింది. ఒక జీవిత భాగస్వామిపై మరొకరికి అభ్యంతరం ఉన్నప్పటికీ అలాంటి కార్యకలాపాలను కొనసాగిస్తే అది నిస్సందేహంగా మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
ఈ జంట 2018లో ప్రేమ వివాహం చేసుకుంది. భర్త ఫిర్యాదు ప్రకారం, ఆ మహిళ వివాహం తర్వాత తన ‘‘పాత ప్రేమికుల’’తో మొబైల్‌లో మాట్లాడేది. వాట్సాప్ సంభాషణలు అసభ్యకరంగా ఉన్నాయని ఆమె భర్త ఆరోపించాడు. దీంతో తనకు సంబంధం లేదని భార్య, భర్త వాదనల్ని తోసిపుచ్చింది. తన భర్త తన మొబైల్‌ని హ్యాక్ చేసి, తనకు వ్యతిరేకంగా ఆధారాలు సృష్టించడానికి ఆ సందేశాలను ఇద్దరు పురుషులకు పంపాడని కూడా ఆమె పేర్కొంది. తన భర్త చర్యలు తన గోప్యతా హక్కుని ఉల్లంఘించాయని ఆ మహిళ ఆరోపించింది. ఆమె అతడిపై రూ.25 లక్షల కట్నం డిమాండ్ ఆరోపణలు చేసింది. అయితే, భర్త ఆరోపణల్లో అర్హత ఉందని కోర్టు గుర్తించింది. మహిళ తండ్రి కూడా తన కుమార్తె తన బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడేదని సాక్ష్యమిచ్చాడు. దీంతో దిగువ కోర్టు మంజూరు చేసిన విడాకుల్ని, హైకోర్టు సమర్థించింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!