90 Degree turn Bridge: ఒరేయ్ ఎవడ్రా ఈ వంతెన కట్టింది.. 90 డిగ్రీల మలుపుతో ప్రమాదాలు
- భోపాల్‌లోని ఐష్‌బాగ్ స్టేడియం సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మణం..
- వంతెనను 90 డిగ్రీల మలుపుతో నిర్మించడంపై భయపడుతున్న స్థానికులు..
- ఒరేయ్ ఎవడ్రా ఈ వంతెన కట్టింది అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న నెటిజన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
90 Degree turn Bridge: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలోని ఐష్‌బాగ్ స్టేడియం సమీపంలో నిర్మించిన ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి ముందే.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వంతెనను 90 డిగ్రీల మలుపుతో నిర్మించారు. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. అయితే, ఈ వంతెన నిర్మాణానికి భూమి కొరత ఏర్పడటంతో.. సమీపంలోనే మెట్రో రైలు స్టేషన్ ఉండటంతో ఈ బ్రిడ్జిను ఇలా నిర్మించక తప్పలేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఈ వంతెన మహామై కా బాగ్, పుష్పా నగర్, స్టేషన్ ప్రాంతం నుంచి న్యూ భోపాల్‌కు రాకపోకలు కొనసాగుతాయి.. ఈ ఓవర్‌బ్రిడ్జిపై చిన్న వాహనాలు మాత్రమే నడుస్తాయి.. భారీ వాహనాలను అనుమతించబోమని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజనీర్ వి డి వర్మ తెలిపారు.
Read Also: Mithra Mandali : నవ్వుల తుపాన్‌గా దూసుకొచ్చిన ‘మిత్ర మండలి’ టీజర్..!
Also Read
అయితే, 2023 మార్చిలో ఈ వంతె నిర్మాణానికి ముందు.. ఐష్‌బాగ్ ప్రాంత ప్రజలు రైల్వే క్రాసింగ్ దగ్గర వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది.. కానీ, ఇప్పుడు అవసరం లేదని అధికారులు తెలియజేస్తున్నారు. 3 లక్షల మంది ఈ బ్రిడ్జి వల్ల ప్రయోజనం పొందుతారని చెప్పారు. సుమారు రూ.18 కోట్లతో నిర్మించిన ఈ ఓవర్‌బ్రిడ్జి 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పు ఉంది. కానీ, ఈ వంతెనలో ఉన్న 90 డిగ్రీల మలుపు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికలు భయపడుతున్నారు. కాగా, ఈ ఫోటోలు కాస్తా సోషల్ మీడియా ప్రత్యక్షం కావడంతో నెటిజన్స్ ఈ వంతెన డిజైన్‌పై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒరేయ్ ఎవడ్రా ఈ వంతెన కట్టింది అని సెటైర్లు వేస్తున్నారు.
తాజావార్తలు
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?