భోలే బాబాపై కేసు, అరెస్టుకు సంబంధించి మీడియా ప్రశ్నలు అడగగా.. ఐజీ మాట్లాడుతూ.. ఏడీజే జోన్ స్థాయి నుంచి అన్ని జిల్లాల్లో ఎస్‌ఓజీ టీంలను ఏర్పాటు చేశామన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం హత్రాస్‌కు వెళ్లనున్నారు. హత్రాస్‌లో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. కాంగ్రెస్ నేతలు రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్లనున్నట్లు సమాచారం.
హత్రాస్ తొక్కిసలాటలో బాధితులందరి మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ గురువారం వెల్లడించారు. మంగళవారం హత్రాస్‌లో బోధకుడు నారాయణ్ సకార్ హరి లేదా భోలే బాబా నిర్వహించిన సత్సంగం తర్వాత జరిగిన తొక్కిసలాటలో మొత్తం 123 మంది మరణించారు.
హత్రాస్‌లో సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం తెలిపారు. వీరంతా సత్సంగాన్ని నిర్వహించే ఆర్గనైజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 123 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన అధికారులు భోలే బాబా ఆశ్రమంలో నిర్వహించారు. ఈ తనిఖీల్లో భోలే బాబా ఆశ్రమం 13 ఎకరాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆశ్రమం ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించేలా ఉన్నట్లు తెలిసింది.
Rahul Gandhi: 120కి పైగా ప్రజల ప్రాణాలను తీసిన భయంకరమైన తొక్కిసలాట ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగింది. ఈ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భోలో బాబాగా పిలువబడే వ్యక్తి నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమానికి లక్షల మంది జనాలు రావడం, బాబా పాదధూళి కోసం జనాలు ఎగబడటం ఒక్కసారిగా తొక్కిసలాటకు కారణమైంది.
Hathras stampede: యూపీలోని హత్రాస్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 121 మంది మృతి చెందిన కేసులో పోలీసులు చర్యలు చేపట్టి 20 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు.
Hathras Stampede: ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పో్యారు. తనను తాను దేవుడిగా చెప్పుకునే ‘భోలే బాబా’ సత్సంగ్ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో రావడం, అందుకు తగ్గట్లు సౌకర్యాలు లేకపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
Hathras stampede: ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాట దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మతపరమైన ధార్మిక కార్యక్రమానికి లక్షల్లో జనాలు హాజరుకావడం ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో 120 మంది చనిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లో 121 మంది మృతికి కారణమైన హత్రాస్ భోలే బాబాపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం భోలే బాబా దర్శనంపై పెద్ద ఎత్తున భక్తులు ఎగబడడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది.