Rahul Gandhi: తొక్కిసలాట జరిగిన హత్రాస్‌లో పర్యటించనున్న రాహుల్ గాంధీ..
- హత్రాస్‌లో పర్యటించనున్న రాహుల్ గాంధీ..
- తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలకు పరామర్శ..
- 123 మంది ప్రాణాలు బలిగొన్న విషాద ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: 120కి పైగా ప్రజల ప్రాణాలను తీసిన భయంకరమైన తొక్కిసలాట ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగింది. ఈ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భోలో బాబాగా పిలువబడే వ్యక్తి నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమానికి లక్షల మంది జనాలు రావడం, బాబా పాదధూళి కోసం జనాలు ఎగబడటం ఒక్కసారిగా తొక్కిసలాటకు కారణమైంది. ఈ ఘటనలో 123 మంది మరణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇతర దేశాధినేతలు ఈ సంఘటనపై తమ సంతాపాన్ని తెలియజేశారు. తొక్కిసలాట దుర్ఘటనపై విచారణకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసింది.
Read Also: Brain-eating amoeba: “మెదడును తినే అమీబా” ఇన్ఫెక్షన్‌తో 14 ఏళ్ల బాలుడి మృతి..
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ఇదిలా ఉంటే ఈ విషాద ఘటన జరిగిన హత్రాస్ ప్రాంతాన్ని సందర్శించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ హత్రాస్‌లో పర్యటించే యోచనలో ఉన్నారని చెప్పారు. తొక్కిసలాట గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది దురదృష్టకర సంఘటన, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (రాహుల్ గాంధీ) హత్రాస్‌ను సందర్శించాలని యోచిస్తున్నారు. ఆయన అక్కడికి వెళ్లి బాధిత ప్రజల పరామర్శిస్తారని చెప్పారు.
80 వేల మంది సరిపడే సౌకర్యాలు ఉన్నప్పటికీ 2.5 లక్షల మంది సత్సంగ్‌కి చేరుకోవడం కూడా ప్రమాద తీవ్రతను పెంచాయి. ఈ ఘటనకు కారణమైన భోలే బాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. అయితే, నిన్న అతని లాయర్ ద్వారా ఓ ప్రకటన చేస్తూ.. ఘటనలో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!