Hathras Stampede: “సంఘ వ్యతిరేక శక్తుల” వల్లే తొక్కిసలాట.. భోలే బాబా ప్రకటన..
- సంఘ విద్రోహ శక్తుల వల్లే తొక్కిసలాట..
- భోలే బాబా ప్రకటన..
- ఘటన తర్వాత నుంచి పరారీలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras Stampede: ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పో్యారు. తనను తాను దేవుడిగా చెప్పుకునే ‘భోలే బాబా’ సత్సంగ్ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో రావడం, అందుకు తగ్గట్లు సౌకర్యాలు లేకపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. అయితే, ఈ సంఘటన జరిగనప్పటి నుంచి భోలే బాబా పరారీలో ఉన్నాడు. ఈ రోజు సాయంత్రం ఒక ప్రకటనలో ఈ సంఘటనకు ‘‘సంఘ వ్యతిరేక శక్తులు’’ కారణమని ఆరోపించార. ఇది భయంకరమైన గందరగోళాన్ని సృష్టించిందని ఆరోపించారు. భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్ సింగ్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతునట్లు ప్రకటించారు.
Read Also: Shalini : ఆస్పత్రిలో హీరో అజిత్ భార్య.. ఏమైందంటే..?
Also Read
- SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో భోలే బాబా పేరు నమోదు కాలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అతని సహాయకులు, ఈవెంట్ నిర్వాహకుల పేర్లు ఎఫ్ఐఆర్‌లో నమోదయ్యాయి. భోలే బాబాను అరెస్ట్ చేస్తారనే ప్రశ్నకు రాష్ట్ర డీజీపీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఈ సంఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. సమావేశ నిర్వాహకులు సంఘటనను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ సంఘటనపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దోషులను వదిలిపెట్టేది లేదని సీఎం చెప్పారు. భోలే బాబా పాదాల వద్ద ధూళిని తీసుకునేందుకు జనాలు ఎగబడటం, అదే సమయంలో అతని సెక్యూరిటీ ప్రజల్ని నెట్టేయడంతో తొక్కిసలాట ప్రారంభమైనట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!