Rahul Gandhi: రేపు హత్రాస్‌లో రాహుల్ పర్యటన.. బాధిత కుటుంబాలను పరామర్శించనున్న అగ్రనేత
- రోడ్డు మార్గంలో వెళ్లనున్న రాహుల్ గాంధీ
- బాధితులకు పరామర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం హత్రాస్‌కు వెళ్లనున్నారు. హత్రాస్‌లో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. కాంగ్రెస్ నేతలు రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్లనున్నట్లు సమాచారం. తాజాగా హత్రాస్‌లో ఒక మతపరమైన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనలో, స్వయం ప్రకటిత దేవుడు ‘భోలే బాబా’ అలియాస్ నారాయణ్ సకర్ హరి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే ఈ ఘటనలో ఆర్గనైజింగ్ కమిటీకి సంబంధించిన ఆరుగురిని
ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల అంతర్గత విచారణ నివేదిక నిర్వహణ, భద్రతా ప్రోటోకాల్‌లలో తీవ్రమైన లోపాలను వెల్లడించింది.
READ MORE: Amla: వానాకాలంలో ఉసిరితో ఎన్ని లాభాలో..!
Also Read
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
హత్రాస్ ప్రమాదంపై విలేకరుల సమావేశంలో ఐజి శలభ్ మాథుర్ మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్‌పై లక్ష రూపాయల రివార్డు ఉంచినట్లు తెలిపారు. త్వరలో అతడిపై కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయనున్నారు. అవసరమైతే భోలే బాబాను విచారిస్తామని ఐజీ తెలిపారు. బాబా పాత్ర వెలుగులోకి వస్తే అతడిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా.. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన అధికారులు భోలే బాబా ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భోలే బాబా ఆశ్రమం 13 ఎకరాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆశ్రమం ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించేలా ఉన్నట్లు తెలిసింది. భోలే బాబా అని పిలవబడే నారాయణ్ సాకర్ హరి మెయిన్‌పురి బిచ్వాలో కోట్ల విలువైన విలాసవంతమైన ఆశ్రమంలో నివసించారు. ‘ప్రవాస్ ఆశ్రమం’ అని పిలవబడే ఈ భవనం అలీఘర్-గుజరాత్ రహదారిపై 13 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. ఈ విలాసవంతమైన భవనంలో అన్ని ఫైవ్-స్టార్ సౌకర్యాలతో పాటు బాబాకు చెందిన లగ్జరీ కార్లను ఉంచడానికి పెద్ద గ్యారేజీ ఉంది. విలాసవంతమైన కార్ల సముదాయాన్ని ఉంచడానికి భారీ గ్యారేజీ ఉంది. ఈ విలాసవంతమైన ఆశ్రమంలో బాబా కోసం ప్రత్యేకంగా ఆరు గదులను కేటాయించినట్లు వెల్లడైంది.
తాజావార్తలు
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!