Bhole Baba Missing: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లోని ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరుకుంది. కాగా.. సత్సంగ్ నిర్వహించిన తర్వాత జరిగిన ఘటనతో ‘భోలే బాబా’ పరార్ అయ్యాడు.
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ జిల్లాలోని రతీఖాన్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదాంతమైంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి దాదాపు 100 మందికి పైగా భక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. భోలే బాబాగా ప్రసిద్ధి చెందిన నారాయణ్ సాకార్ హరి సత్సంగంలో పెద్ద సంఖ్యలో భక్తులు అధికంగా పాల్గొనడంతో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.