ఉత్తరప్రదేశ్‌లో 121 మంది మృతికి కారణమైన హత్రాస్ భోలే బాబాపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం భోలే బాబా దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు ఎగబడడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో పిల్లలు, మహిళలు దాదాపు 121 మంది ప్రాణాలు వదిలారు. భోలే బాబా సత్సంగ్ కార్యక్రమం గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. అయితే మంగళవారం చివరి రోజు కావడం.. పైగా భక్తులు కూడా భారీగా తరలివచ్చారు. అయితే బాబా పాద ధూళి కోసం భక్తులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది.
ఇది కూడా చదవండి: Uddhav Thackeray: “మీరు రాహుల్ గాంధీని ఆపలేరు”.. ఠాక్రే పార్టీ ప్రశంసలు..
అయితే ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్రాస్ ఈవెంట్ నిర్వహించిన భోలే బాబాపై లైంగిక వేధింపుల కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా వివాదాస్పద ‘సత్సంగ్’గా ప్రసిద్ధి చెందాడు. ఇతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సహా పలు చట్టపరమైన కేసులున్నాయి. ఆగ్రా, ఇటావా, కస్గంజ్, ఫరూఖాబాద్, రాజస్థాన్‌లో అతనిపై అనేక కేసులు నమోదు అయ్యాయి. ఆధ్యాత్మిక జ్ఞానోదయం, ఆశీర్వాదాల వాగ్దానాలకు ఆకర్షితులైన ప్రజలు.. వందలాది మంది అతనికి అనుచరులుగా మారిపోయారు.
ఇది కూడా చదవండి: Kalki 2898 AD: ఆరు రోజుల్లో 680 కోట్లు.. కల్కి రాంపేజ్!
భోలే బాబా కాస్గంజ్‌లోని బహదూర్ నగర్‌లో జన్మించారు. 1997లో లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొనే ముందు పోలీసు శాఖలో పనిచేశాడు. ఈ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత పూర్వీకుల గ్రామంలోని తన ఆశ్రమానికి భక్తులను ఆకర్షించాడు. ‘సాకర్ విశ్వ హరి బాబా’గా భక్తుల్ని ఆకట్టుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లో తన అనుచరులకు భోలే బాబా అని పిలువబడే స్వయం ప్రఖ్యాత దైవం సూరజ్ పాల్‌గా గుర్తింపు పొందాడు. మంగళవారం బాబా పాదాల క్రింద ధూళిని సేకరించడానికి భక్తులు ప్రేరేపింపబడ్డారు. దీంతో పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాటలో కాళ్ల క్రింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 121 మంది చనిపోగా.. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. వందలాది మంది భక్తులు బాబా కారు వెనుక పరిగెత్తడం వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: Zika virus: జికా వైరస్‌పై అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసిన కేంద్రం..