Hathras Stampede: హత్రాస్ ఘటన.. మృతదేహాలు బాధిత కుటుంబాలకు అప్పగింత
- హత్రాస్ తొక్కిసలాటలో బాధితుల మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగింత
- ఈ మేరకు వెల్లడించిన జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాటలో బాధితులందరి మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ గురువారం వెల్లడించారు. మంగళవారం హత్రాస్‌లో బోధకుడు నారాయణ్ సకార్ హరి లేదా భోలే బాబా నిర్వహించిన సత్సంగం తర్వాత జరిగిన తొక్కిసలాటలో మొత్తం 123 మంది మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు మృతి చెందారు. దాదాపు 31 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత 21 మృతదేహాలను ఆగ్రాకు, 28 ఎటాహ్‌కు, 34 హత్రాస్, 38 మృతదేహాలను అలీఘర్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అన్ని మృతదేహాలను గుర్తించి సంబంధిత కుటుంబాలకు అప్పగించినట్లు ఆశిష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం వరకు గుర్తుతెలియని మూడు మృతదేహాల్లో రెండు అర్థరాత్రి, ఒకటి గురువారం ఉదయం వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడి గుర్తించినట్లు తెలిపారు. చివరి మృతదేహాన్ని కుటుంబసభ్యులు వీడియా కాల్ ద్వారా గుర్తించగా.. వారిని అలీఘర్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు.
Read Also: Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందితుడి సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
హత్రాస్ దుర్ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తొక్కిసలాట వెనుక “కుట్ర” దాగి ఉందనే విషయాన్ని కూడా పరిశీలిస్తోంది. ప్యానెల్ తన నివేదికను రెండు నెలల్లో సమర్పించనుంది. హత్రాస్‌లోని ఫుల్హరి గ్రామ సమీపంలో ‘సత్సంగ్’ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ సత్సంగ్ కార్యక్రమానికి 80,000 మందికి పరిపాలన అనుమతి ఇచ్చినప్పటికీ, 2.50 లక్షల మందికి పైగా ప్రజలు మతపరమైన సమావేశానికి హాజరయ్యారు. ‘ముఖ్య సేవాదార్’ దేవప్రకాష్ మధుకర్, ఇతర నిర్వాహకులపై మంగళవారం సికంద్రరావు పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్నారు. భోలే బాబా అని పిలువబడే బోధకుడి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. బుధవారం హత్రాస్‌ను సందర్శించి గాయపడిన వారిని పరామర్శించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా భోలేబాబాను ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ప్రాథమికంగా కేసు నమోదు చేశామని పోలీసులు ఆయనకు తెలిపినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!