ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు.
బడ్జెట్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. బడ్జెట్లో కేటాయించిన ప్రతి రూపాయిని అన్ని వర్గాలకు చేరాలన్నదే మా ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిగా రాజ్యాంగ పీఠికను గుర్తు చేశామన్నారు. ఇచ్చిన హామీలు, అమలు, బడ్జెట్ ఉందా లేదా అనేది అంచనా లేకపోవడంతో పదేళ్లు ఇబ్బంది జరిగిందన్నారు.
అసెంబ్లీకి రాని వ్యక్తి.. మంగళవారం నల్గొండలో అసెంబ్లీకి వెళ్తావా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపాలని కోరితే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని విమర్శించారు . అసెంబ్లీకి రాని వ్యక్తి రేపు బహిరంగ సభకు వెళ్తారా అంటూ…
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా TSRTC 100 బస్సులను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కొత్తగా ప్రారంభించిన బస్సులను మేడారంకు కూడా నడపనున్నుట్లు ఆయన చెప్పారు. మరోవైపు.. పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరో 1000 బస్సులు కొంటామని ముఖ్యమంత్రి చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్ పెట్టాలని మేనిఫెస్టోలో…
హైదరాబాద్ ఎన్టీఆర్మార్గ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద TSRTC కొత్త బస్సులు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 100 కొత్త బస్సులు ప్రారంభించటం సంతోషకరం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలు…
Telangana Budget Updates: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. 2024-25కి సంబంధించి ఓటింగ్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ కమిటీ హాల్ నంబర్ 1లో జరిగిన మంత్రివర్గ సమావేశం..
తెలంగాణ ప్రభుత్వం రేపు బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. రేపు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడం పట్ల అభినందిస్తూ తెలంగాణ శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డ, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధానికి కేంద్రం భారతరత్న ప్రకటించడంతో ఈరోజు తెలంగాణ గుండె ఉప్పొంగింది అని అన్నారు.