బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టే నాగార్జున సాగర్ కట్టామన్నారు. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టే శ్రీశైలం కట్టామని ఆయన పేర్కొన్నారు. నీకు తెలియదు కాబట్టి కూలి పోయేలా కాళేశ్వరం కట్టావు కేసీఆర్ అని ఆయన విమర్శలు గుప్పించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాకు…
MAA President Vishnu Manchu met Deputy CM Mallu Bhatti Vikramarka: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి చిత్ర పరిశ్రమ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున బహుమతి అందజేశారు. ఇక ఈ భేటీలో అనేక విషయాల మీద విష్ణు మంచు, భట్టి విక్రమార్క చర్చించారు. ఈ భేటీ గురించి మా అధ్యక్షుడు మంచు విష్ణు…
ధరణి మూలంగా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగిస్తామని ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పోరాట యోధులు అమరుల, తాడిత పీడితుల ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని ఇటీవల రెండు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కళాకారులకు అందించే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని ఇంద్రవెల్లి అమరుల స్థూపంగా ప్రమాణం…
Hydrabad ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ ఉన్న హెచ్ఎండీఏకు చెందిన ఖాళీ స్థలంలో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను సృష్టించేందుకు టౌన్‌షిప్‌లు నిర్మించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఖ్యాతిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నందున దానికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం డా. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని డిప్యూటి సీఎం కార్యాలయంలో 2024-25 వార్షిక బడ్జెట్‌కు సంబందించి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రూపొందించిన ప్రతిపాదనల పై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. హైదరాబాద్ మహనగరానికి సంబంధించి నాలుగు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి…
ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్‌కు నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 7వేల మంది స్టాఫ్ నర్సులను పెద్ద ఎత్తున ఒకేసారి నియామకం చేసుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ ఉన్న ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న…
సౌత్ కొరియా తీరం వద్ద కూలిన అమెరికా యుద్ధ విమానం.. దక్షిణ కొరియా తీరంలో అమెరికా యుద్ధ విమానం ఎఫ్-16 కూలింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆ విమాన పైలెట్ సేఫ్ గా బయట పడ్డారు. కేవలం నెలన్నర సమయంలో కొరియా తీరంలో ఎఫ్-16 యుద్ధ విమానం కూలడం ఇది సెకండ్ టైమ్. గత ఏడాది డిసెంబర్లో కూడా ఓ యుద్ధ విమానం కూడా ఇక్కడే కూలిపోయింది. 8వ ఫైటర్ వింగ్‌కు చెందిన ఎఫ్-16 ఫైటింగ్…
సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించే ప్రతి పైస ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. తక్కువ నిధులతో ఎక్కువ నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధన్యతగా తీసుకోవాలన్నారు. మంగళవారం డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలోని డిప్యూటి సీఎం కార్యాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనల పై మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తో కలిసి సంబంధిత అధికారులతో…
నోటికివచ్చినట్టు మాట్లాడటానికి సిగ్గుందా? బీఆర్ఎస్ నేతలపై భట్టి ఫైర్ ఇంటికో ఉద్యోగం, ఊరికో బడి, కేజీ టు పీజీ, మూడు ఎకరాల భూ పంపిణీ, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని వాగ్దానాలు చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన గత బిఆర్ఎస్ పాలకులు నలభై రోజుల నిండని కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్యారెంటీలు అమలు చేయడం లేదంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడాటానికి సిగ్గుందా? బుద్ధి ఉందా? అంటూ…
దేశాన్ని ఏకం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. దేశ సంపద ఈ ప్రజలకే చెందాలని రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. లౌకికవాదం కలిగిన ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఇక్కడి బిడ్డనేనని మతం పేరిట విభజన చేయడం తగదన్నారు. మత విభజన పేరిట వైశ్యామ్యాలను సృష్టించి…