ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పథకాలను అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపే అమలులోకి తీసుకువచ్చింది. అయితే.. మిగిలిన పథకాల్లో రెండు పథకాలను నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లు ప్రకటించిందని, విప్లవాత్మక ఆలోచనలతో కూడిన నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకుందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తోందా అని రాష్ట్రం వైపు దేశం చేస్తోందని, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్…
సింగరేణి సంస్థల్లో పని చేసే 43 వేల మందికి ప్రమాద వశాత్తు ఏదైనా జరిగితే కోటి రూపాయల భీమా వర్తించే పథకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సంక్షేమ రాజ్యానికి సాక్ష్యం ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీలతో పాటు సింగరేణి కార్మికులకు ఇన్సూరెన్స్ ఇస్తున్నామన్నారు. కార్మికులను కాపాడుకోవడం మా భాద్యత అని ఆయన అన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల కు కూడా 20 నుంచి 30 లక్షల ఇన్సూరెన్స్ చేయించామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి…
Begumpet: బేగంపేట్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ.. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న చేవెళ్ల సభలో మరో రెండు గ్యారెంటీ పథకాల అమలు ప్రకటన చేస్తామని తెలిపారు. మార్చి నెలలో 200 యూనిట్లు లోపు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అంతేకాకుండా.. డ్వాక్రా సంఘాలకు త్వరలో వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. రేపు సాయంత్రం 43,000 మంది సింగరేణి కార్మికులకు కోటి…
దేశంలోనే పొడవైన కేబుల్ బ్రిడ్జిని నేడు జాతికి అంకితం ఇవ్వనున్న మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిని సందర్శించిన తర్వాత, ప్రధాని మోడీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం గుజరాత్లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో ప్రధానమంత్రి రాష్ట్రానికి రూ. 52 వేల కోట్లకు పైగా కొత్త ప్రాజెక్టులను బహుమతిగా ఇవ్వనున్నారు. కాగా, సుదర్శన్ బ్రిడ్జిని కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ వంతెనను గుజరాత్లోని ద్వారకా జిల్లాలో నిర్మించారు. దీనికి ముందు వారణాసి…
1. నేడు ఏపీలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష. ఉదయం 10.30 నుంచి మధ్యా్హ్నం 1 గంట వరకు పరీక్ష. గ్రూప్-2 పరీక్షకు 4,83,525 మంది దరఖాస్తు. ఏపీ వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్-2 పరీక్ష. గ్రూప్-2 కోసం ఏపీ వ్యాప్తంగా 1,327 పరీక్ష కేంద్రాలు. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు. 2. నేడు కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ప్రారంభం. నేడు యానం ప్రభుత్వ ఆస్పత్రిలో జిప్మర్ మల్టీ స్పెషాలిటీ యూనిట్ ప్రారంభం.…
ఇంటర్ నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలపై విద్యా శాఖ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యంలో పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ వార్షిక సంవత్సరంలో రూ. 2500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎస్సీ, బీసీ, మైనార్టీ…
రాష్ట్రంలోని రైతులు, వ్యాపారులు, వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్తును సంపూర్ణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎండి రీజ్వితో కలిసి ట్రాన్స్కో ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్నా కూడా సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిచోట్ల చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. మెయింటెనెన్స్, ఓవర్ లోడ్…
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు ఢిల్లీ వెళ్లారు. కాసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో సీఎం, డిప్యూటి సీఎం, మంత్రి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై హైకమాండ్తో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. మరోవైపు.. పలువురు కేంద్ర మంత్రులను కూడ…
కాళేశ్వరం నిట్ట నిలువునా చిలిపోయింది అని పేర్కొన్నారు. మేడిగడ్డ కాదు అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు కూడా పోతది అని NDSA చెప్పింది అని తెలిపారు. జ్యోతిష్యం కాదు, నిపుణులు చెప్పిన మాట అని మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.