ఇంటికో ఉద్యోగం, ఊరికో బడి, కేజీ టు పీజీ, మూడు ఎకరాల భూ పంపిణీ, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని వాగ్దానాలు చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన గత బిఆర్ఎస్ పాలకులు నలభై రోజుల నిండని కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్యారెంటీలు అమలు చేయడం లేదంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడాటానికి సిగ్గుందా? బుద్ధి ఉందా? అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు…
టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొద్ది మంది సోషల్ మీడియా వీరులు కరెంటు సరఫరా పైన తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు తో పాటు ఎటువంటి కోతలు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలు కంటున్న బిఆర్ఎస్ సోషల్ మీడియా వీరుల ఆశలను, అసలు స్వరూపాన్నిప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వమని,…
ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో కాంగ్రెస్ సభ నిర్వహించారు. ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో స్వేచ్ఛ లేని పరిస్థితికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుని వచ్చిందని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశాను.. పాదయాత్ర ద్వారా ఉద్యమం చేశాను.. మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం కోసం కృషి చేశానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మాట్లాడితే కేసులు ఉండేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనను ఉప ముఖ్యమంత్రిని చేసి…
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చందన వెళ్లి గ్రామంలో జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. స్ట్రింగర్ మిషన్ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి విధానం గురించి అక్కడ ఉన్న ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. సోలార్…
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చందనవెల్లి గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సంద్భంగా.. చందనవెల్లి భూ బాధితులు ఆయనను కలిశారు. అనంతరం వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చందనవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 190లోని భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. ఎంజాయ్ మెంట్ సర్వే పేరిట భూమి లేని వారి పేర్లను భూ సేకరణలో చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. ఆదిలాబాద్…
జెండా భుజాన పెట్టుకుని పార్టీని అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలే అని తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఎల్బీస్టేడియంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచ్చేశారు. అయితే.. ఈ బహిరంగ సభలో పాల్గొన్న భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. విద్వేషాలు చిమ్ముతున్న బీజేపీ కి వ్యతిరేకంగా యాత్ర చేస్తున్నారు రాహుల్ అని ఆయన కొనియాడారు. ఇబ్బందులు ఉన్నా.. ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తామని…
మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆధ్వర్యంలో టూరిజం ప్లాజాలో నిర్వహించిన వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు దేవాలయ ఖాళీ భూముల్లో ఆలయ సందర్శకుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ శాఖలకు సంబంధించి బడ్జెట్ అంచనాల ముందస్తు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ,…
సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన బీసీ సంక్షేమ శాఖపై బడ్జెట్ సన్నాహక సమీక్షా సమావేశం జరిగింది.. సమీక్షా సమావేశానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రెటరీ హరిత, బీసీ వెల్ఫెర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హాజరయ్యారు.. గతంలో బీసీ సంక్షేమానికి కేటాయించిన నిధులు ప్రస్తుతం బడ్జెట్ లో కటాయించాల్సిన అంశాల పై చర్చ జరిగింది. ప్రధానంగా బీసీ రెసిడెన్షియల్…
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందేందుకు పలు సూచనలు, ప్రతిపాదనలను ఈ బృందం ఉప ముఖ్యమంత్రికి అందచేసింది. రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు తెచ్చే…