Mallu Bhatti Vikramarka: నన్ను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల సీతారాంపురం సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం లో చెప్పిందే చేస్తాం చేయగలిగేదే చెప్తామన్నారు. నన్ను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అన్నారు. సీతారపురం గ్రామస్థులు చల్లగా ఉండాలన్నారు. అభివృద్ధి పన్నులో నంన్యత పాటించాలి పనుల విషయంలో అధికారులు పర్యవేక్షణ తప్పని సరి అని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యాంలో ఆరు గ్యారెంటీలు తప్పక అమలు చేసి తీరుతామన్నారు. రాష్ట్రంలో పేదలకు 2వందల యూనిట్లు విద్యుత్,5వందలకే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిపిస్తున్నాం అన్నారు. పేదల కోసం రూ10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నామన్నారు. మధిర నియోజకవర్గ ప్రజల ఓటుకు గౌరం తెచ్చే విధంగా పనిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం లో మంత్రులు గా కంకణ బద్ధులై పనిచేస్తున్నామన్నారు. ఉద్యోగులను గత ప్రభుత్వం ఇబ్బందుకు గురిచేసింది.కాంగ్రెస్ ప్రభుత్వం వారిని తిరిగి అదుకుంటుందన్నారు.
Read also: BRS Chalo Medigadda: బీఆర్ఎస్ నేతలకు తప్పిన ప్రమాదం.. పేలిన బస్సు టైర్
మహిళలను ఆర్దికంగా నిలబెట్టేందుకు రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కు వడ్డీలేని రుణాలను అందజేస్తామన్నారు. నిరుద్యోగులు గత ప్రభుత్వం లో ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడ్డారన్నారు. 2.75 కోట్ల బడిజెట్ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఉదేశ్యంతో ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది రోజుల్లోనే లో 25 వెల ఉద్యోగులు బర్తిచేసి గ్రూప్ 1నోటిఫికేషన్ కూడా విడుదల చేసామన్నారు. రాష్టంలో ప్రతి బిడ్డచదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట ప్రతి వాగ్దానం నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవరిని మోసం చేయాలని ఆలోచన మాకు లేదు పదేళ్లు ప్రజలకు భ్రమలు కల్పించి పబ్బం కడుపుకోవాలనే ఆలోచన అంతకన్నా లేదన్నారు. వందేళ్ళ చరిత్ర కలిగిన ఈ పార్టీ మరో వందేళ్లు రాష్ట్రాన్ని దేశాన్ని పాలన సాగించి ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రజలను మోసం చేసి పాలన సాగిస్తే రానున్న రోజులు ఇంటికి పంపిస్తారు, ప్రజలకు అంకితమై పని చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ బస్సు ఘటన.. షెడ్డుకు పోవాల్సందే అన్న ఉత్తమ్