కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న చేవెళ్ల సభలో మరో రెండు గ్యారెంటీ పథకాల అమలు ప్రకటన చేస్తామని తెలిపారు. మార్చి నెలలో 200 యూనిట్లు లోపు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అంతేకాకుండా.. డ్వాక్రా సంఘాలకు త్వరలో వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. రేపు సాయంత్రం 43,000 మంది సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.
Kishan Reddy: తెలంగాణ ప్రజలు మోడీ నాయకత్వం కోరుకుంటున్నారు..
కావలసినంత నాణ్యమైన విద్యుత్తు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్పి భారీ ప్రాజెక్టులపై పంప్ స్టోరేజ్ కి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. గత పదేళ్లుగా విద్యుత్ పాలసీ లేకపోవడంతో రాష్ట్రానికి ఎవరు రాలేదని తెలిపారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతోందని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో సింగరేణిలో బొగ్గు పత్తిని 67 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నులకు పెంచుతాం.. రాష్ట్రంలోని బొగ్గు గనులన్నీ సింగరేణికే చెందాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సర్కులర్ జారీ చేసింది.. గత పదేళ్లుగా కనీస వేతన చట్టం లేక లక్షలాది కార్మికులు నష్టపోయారని డిప్యూటీ సీఎం తెలిపారు.
PM Modi: మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
సీఎల్పీ నేతగా ప్రతి సభలోను ఆ అంశాన్ని ప్రశ్నించినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కావడంతో సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని తెలిపారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉద్యోగం కల్పించడమే ఇందిరమ్మ సంక్షేమ రాజ్యము లక్ష్యమని భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణిలో ప్రారంభించిన సౌర విద్యుత్ ప్రాజెక్ట్ రాష్ట్రానికే కాదు దేశానికి దిశా నిర్దేశం అని తెలిపారు. సింగరేణి సంపదను రాష్ట్ర ప్రజలకు, కార్మికులకు పంచుతామని అన్నారు. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా అని కేసిఆర్ ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రజలు కరెంటు కావాలి కాంగ్రెస్ కావాలని తీర్పునిచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం ప్రారంభించిన భద్రాద్రి, యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాలు రాష్ట్రానికి గుదిబండలా మారాయని దుయ్యబట్టారు. విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్ సర్కారు విఫలం చెందితే బాగుండు అని కొందరు మిత్రులు కలలు కంటున్నారని చెప్పారు.